చంద్రబాబు సరికొత్త విజయం !

By Xappie Desk, November 26, 2018 14:23 IST

చంద్రబాబు సరికొత్త విజయం !

మన దేశంలోనే సాంకేతికతను చంద్రబాబు వాడిన విధంగా వాడగల నాయకుడు మరొకరు లేరు. గత ఎన్నికల్లో సోషల్ మీడియాను ఉపయోగించి మోడీ అధికారాన్ని చేపట్టగా అయితే చివరికి ఆ టెక్నాలజీని దేశ అభివృద్ధికి ఉపయోగించిన దాఖలాలే లేవు. కానీ చంద్రబాబు మాత్రం రాష్ట్ర అభివృద్ధిలో సాంకేతికత పెద్దపీట వేశారు. ఎప్పుడో దశాబ్దాల క్రితమే చంద్రబాబు తెలుగు ప్రజలకు టెక్నాలజీని పరిచయం చేసారు. ఐటీని తీసుకొచ్చి యువత జీవితాలకు బంగారు బాట వేశారు. అప్పటి నుండి ఆయన టెక్నాలజీని తన పాలనలో అదనపు శక్తి గా ఉపయోగించుకుంటున్నారు.
 
ఈ క్రమంలోనే అమరావతిలో ఆయన నెలకొల్పిన రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌ ఇప్పుడు సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్ర ప్రజల కష్టాల్లో ఆలంబనగా ఉంటుంది. చాలామంది ప్రభుత్వ అధికారుల అక్రమాలకు అడ్డుకట్ట వేస్తోంది. విపత్తులు వచ్చినా, వరదలు ముంచెత్తినా క్షణాల్లో ఈ సెంటర్ స్పందించి సమస్యలను తీర్చడంలో వేగం చూపిస్తుంది. మొన్న చిన్న టిట్లీ తుఫాను సమయంలో ఒక్కరోజులోనే పరిస్థితిని అదుపులోకి తెచ్చి సెల్ఫోన్ టవర్లు తిరిగి పునరుద్ధరించేలా తక్షణ చర్యలు చేపట్టింది. ఆర్టిజీ నుంచి నేరుగా ఎయిర్‌టెల్‌ అధినేతకు చంద్రబాబుతో ఫోన్‌ చేయించి ఫోన్‌ సిగ్నల్స్‌ అప్‌ చేయించడంతో పరిస్థితి మెరుగయింది.
 
ఇలాంటి సమయాల్లో ఒక్క రూపాయి కూడా దారి మళ్లకుండా, తగిన చర్యలు ఈ ఆర్జీటీ చేపట్టింది. అలాగే బాధితులకు పరిహారాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో కే జమ చేయాలని నిర్ణయించింది. అలా వెళ్ళిన డబ్బుని ఆధార్ కార్డుల సహాయంతో వాళ్ల బ్యాంక్ అకౌంట్ లను రికార్డుల్లోకి నమోదు చేశారు. ఇంత పక్కాగా పనులు చేసి వడపోయడం ఆర్ జి టి వల్లనే సాధ్యమైంది. ఏడాది కాలంలో రియల్‌టైమ్‌ గవర్నెన్స్‌ సెంటర్‌, 1100 కాల్‌ సెంటర్ల గురించి తెలియని వారు రాష్ట్రంలో లేరనే చెప్పాలి. కృష్ణా పుష్కరాల సమయంలో సీఎం చంద్రబాబు ఆలోచనల నుంచి ఆవిర్బవించిన వ్యవస్థ ఇది. సోమవారంతో ఈ ఆర్ జి టి ఏర్పడి ఈ ఏడాది కాలం అయినందున ఇకనుండి జిల్లా అర్జీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా చంద్రబాబు చేపట్టిన ఈ కొత్త టెక్నాలజీ ప్రయోగం ఘనవిజయమై దేశ విదేశాల నుండి కూడా ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి.
 Top