లోక్ సత్తా ని నారాయణ నడిపించగలరా ? - విశ్లేషణ !

By Xappie Desk, November 27, 2018 11:58 IST

లోక్ సత్తా ని నారాయణ నడిపించగలరా ? - విశ్లేషణ !

ఇటీవల సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మి నారాయణ కొత్త పార్టీ పెడుతున్నట్లు వార్తలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుప్పుమన్నాయి. ఈ క్రమంలోనే జేడీ లక్ష్మీనారాయణ కూడా తాను కొత్త పార్టీ పెట్టబోతున్న ట్లు కూడా గతంలో ప్రకటించారు. అయితే తాజా సమీకరణాల బట్టి రాష్ట్రంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. గతంలో పార్టీ పెడుతున్న అని ప్రకటించిన జె డి లక్ష్మీనారాయణ లోక్ సత్తా పార్టీని నడిపించడానికి సిద్ధమైపోయారు. అయితే ఒక పార్టీని నడిపించగల సత్తా జేడీ లక్ష్మీనారాయణ కి ఉందా అంటే అదీ అనుమానమే అవుతుంది. ఎందుకంటే గతంలో ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ వ్యవహరించిన తీరు అనేక విమర్శలకు తావిచ్చింది..ముఖ్యంగా ఆయన కేంద్రం కనుసన్నల్లో పని చేసినట్లు అప్పట్లోనే కామెంట్లు వినపడ్డాయి.
 
దీంతో అప్పట్లో జగన్ కేసులో అతిగా ప్రవర్తించి జగన్ ఏదో పెద్ద అవినీతి పరుడు గా అప్పట్లో చిత్రీకరించాలని కొంతమంది భావించిన జగన్ కేసులో ఏది నిరూపించలేకపోయారు. ఈ కేసులో జగన్ పై లక్ష్మినారాయణ మోపిన చాలా సెక్షన్లు వీగిపోయాయి. సీబీఐ జేడీగా ఈయన నమోదు చేసిన ఏ సెక్షన్లూ జగన్ మీద చెల్లవనే విషయం ప్రాథమిక అవగాహన ఉన్న వాళ్లెవరికైనా అర్థం అవుతుంది. అయితే జగన్ వ్యతిరేకుల చేత ఈయన హీరోగా కీర్తింపబడ్డాడు. దాన్ని క్యాష్ చేసుకుందామని రాజకీయాల్లోకి అన్నాడు. ముందుగా బీజేపీలో చేరదామని అనుకున్నాడు. ఆ పై జనసేన, తెలుగుదేశం పార్టీలను కూడా పరిశీలించాడు. చివరికి కొత్త పార్టీ అన్నాడు. అదెందుకు వేస్టు అని లోక్ సత్తాలో సారధ్యం వహిస్తాడట. ప్రస్తుతం లోక్ సత్తా పార్టీ జేపీ ఆధ్వర్యంలో రాజకీయాల్లో రాణిస్తుంది ఈ క్రమంలో జేడీ లక్ష్మీనారాయణ వచ్చి ఏం చేస్తారు అంటూ అనేక కామెంట్లు వినపడుతున్నయి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop