నారా లోకేష్ ప్రచారానికి వస్తాడు .. కానీ కొన్ని కండిషన్ లు మరి !

నారా లోకేష్ ప్రచారానికి వస్తాడు .. కానీ కొన్ని కండిషన్ లు మరి !

తెలుగుదేశం పార్టీ మంత్రి టిడిపి అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి ఎట్టకేలకు స్పందించారు. త్వరలో తెలంగాణ రాష్ట్రంలో రెండో అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రచారంలో ముందుకు దూసుకుపోతున్న క్రమంలో ఎన్నికలకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో చాలామంది ప్రముఖ రాజకీయ నేతలు తమ తమ వ్యూహాలతో హామీలతో ప్రత్యర్థులకు దడ పుట్టిస్తూ ప్రజలకు వరాల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి అధికారం దక్కకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని టిఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు చంద్రబాబు.
 
ఈ క్రమంలో తెలంగాణ ఎన్నికల విషయంలో ఇప్పటివరకు నోరుమెదపని నారా లోకేష్ ఇటీవల విశాఖపట్టణం పర్యటనలో మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ విశాఖపట్టణం లో మీడియా తో మాట్లాడుతూ...హైదరాబాదు ఈ స్థాయిలో అభివృద్ధి చెందిందంటే అది చంద్రబాబు కృషి అన్నారు. తెలంగాణలో టీఆర్ ఎస్ పై ప్రజల నుంచి పెద్ద ఎత్తున్న వ్యతిరేకత వ్యక్తమవుతోందని వెల్లడించారు. తెలంగాణలో ప్రజలు ప్రత్యామ్నాయ ప్రభ్యుత్వాన్ని కోరుకుంటున్నారని వివరించారు. ఈ విషయం వివిధ రూపాల్లో వెల్లడవుతోందన్నారు.
 
తెలంగాణలో ప్రచారం చేస్తారా అనే ప్రశ్నకు ``అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడికైనా ప్రచారానికి వెళ్తా`` అని లోకేష్ సెలవిచ్చారు. మరి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నారా లోకేష్ ని తెలంగాణ ఎన్నికల బరిలో దింపుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top