రేవంత్ రెడ్డి-తెలంగాణ ముఖ్యమంత్రి? సరికొత్త సర్వే!

By Xappie Desk, November 27, 2018 13:06 IST

రేవంత్ రెడ్డి-తెలంగాణ ముఖ్యమంత్రి? సరికొత్త సర్వే!

తెలంగాణలో కేసీఆర్ కు ధీటుగా నిలబడి గల వ్యక్తి ఎవరంటే టీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి నే అని చెప్తారు. కాంగ్రెస్ పార్టీకి ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కొద్ది రోజుల్లో జరగనున్న తెలంగాణ ఎన్నికల్లో ఈ జాతీయ పార్టీ తరఫున ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అందుకే పార్టీ అతనిని వారి స్టార్ క్యాంపెయినర్గా భావించి అతని చేతుల్లో పెద్ద పెద్ద బాధ్యతలను మోపింది. పార్టీలో సీఎం క్యాండిడేట్లు ఎంత మంది వున్నా... పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, సీనియర్ నేతలీజ్ కోమటిరెడ్డి సోదరులు ఇలా అందరిని పక్కన పెట్టి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.
 
విశేషమేమిటంటే ప్రజల్లో కూడా అతనికి అనుకూలంగా విశేష స్పందన లభించింది. హెలిక్యాప్టర్ లో ప్రచారం చేసే బాధ్యతను రేవంత్ రెడ్డి కి అప్పగించారు అంటే పార్టీలు అతని ప్రాముఖ్యతను తెలుసుకోవచ్చు. అయితే ఎవరు సీఎం ప్రత్యర్థిగా ప్రజల మన్ననలు అందుకున్నారు అంటే కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డికే ఎక్కువ ఓట్లు పడ్డాయి అట. బిజెపి నిర్వహించిన ఈ సర్వేలో రేవంత్ రెడ్డికి 16.3 శాతం ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత ఉత్తంకుమార్ 8 శాతం మరియు జాన్నా 5 శాతం ఓట్లతో తర్వాత వరుసలో ఉన్నారు. అలా రేవంత్ రెడ్డి పార్టీలు మిగతా ముఖ్య నేతలతో ప్రజాదరణలో రెండు రెట్లు ముందంజలో ఉన్నారు.
 
అయితే తాజాగా భాజపా జరిపిన సర్వేలో ఈ ఒక్క విషయం తప్ప మిగతాదంతా టీఆరెఎస్ కే అనుకూలంగా వచ్చింది. అంతకుముందు కొద్ది సర్వేలు ఈ సారి కాంగ్రెస్ లో కాంగ్రెస్ విజయం తధ్యమని చెప్పి ఈ సారి 30-40 సీట్లకు పరిమితం అవుతుంది అంటే ఈ సర్వేలో మాత్రం 82 సీట్లతో ఘనవిజయం సాధించి, కూటమిని కేలవం 35 సీట్లకు పరిమితం చేస్తుంది అని చెప్పింది. చూస్తుంటే పూర్తిగా ఈ సర్వేలో కాషాయం ఛాయలు కనపడుతున్నాయి కదా...!
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop