జేడీ కీలక నిర్ణయం వెనుక ఎవరున్నారు?

జేడీ కీలక నిర్ణయం వెనుక ఎవరున్నారు?

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన స్వచ్ఛంద రాజీనామాని ప్రకటించిన అనంతరం ఆయనకు టిడిపి, వైఎస్సార్సిపి, జనసేన ఇలా ఏదో ఒక పార్టీ నుండి ఆహ్వానం వస్తుందని ఆశించారు. చివరికి తానే సొంత పార్టీ పెడుతున్నట్లు వచ్చిన వార్తలు అన్నిటిని కొట్టిపారేస్తూ ఆయన కొత్త పార్టీలోకి చేరారు. అతనికి ఎంతో ఇష్టమైన కేజ్రివాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఆహ్వానాన్ని కూడా తిరస్కరించి ఆయన జయ ప్రకాష్ గారి చెంతకు చేరారు. ఇలా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ లోక్ సత్తా పార్టీలో చేరి రాజకీయ స్థిరత్వం పొందారు.
 
అయితే ముందుగా తన ప్రకటించినట్టు తన వ్యక్తిగత భావాలకు సరిపడే పార్టీలో చేరుతానని అన్న ఇతను సొంతగా పార్టీ పెట్టే ఉద్దేశ్యం కూడా విరమించుకొని లోక్ సత్తా పార్టీలో చేరేందుకు గల కారణాలను అందరి విశ్లేషిస్తున్నారు. ఐపీఎస్ రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసిన ఇతనికి లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ సరైన వ్యక్తిగా కనిపించడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ కూడా ఇలాగే స్వచ్ఛందంగా ఐఏఎస్ పోస్టును వదులుకొని వచ్చినవారే. ప్రజాసేవ విషయంలో వీరిద్దరి అభిప్రాయాలు ఏకాభిప్రాయంతో ఉంటాయని ఆయన నమ్మినట్లు తెలుస్తోంది.
 
ఇకపోతే లోక్ సత్తా పార్టీలో తన చేరిక గురించి సోమవారం ప్రకటించిన ఈ సీబీఐ మాజీ జేడీ ఇప్పటికే పలు జిల్లాల్లో రైతు సమస్యలపై పర్యటించారు. అలాగే జీరో బడ్జెట్‌, గ్రామ సచివాలయంపై, యువతలో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆదివారం లోక్‌సత్తా అధినేత జేపీతో లక్ష్మీనారాయణ సమావేశమైన విషయం తెలిసిందే. అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై సోమవారం మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో ఆయన చర్చలు జరిపారు. తర్వాత జేపీ మాట్లాడుతూ అధికారం అంటే ప్రజలను దోచుకోవడం కాదని దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం ప్రజా శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తూ ఉండటం అని ఆయన అన్నారు. ఇలా లోక్ సత్తా పార్టీ భవిష్యత్తు కార్యాచరణను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళే బాధ్యతను జేడీ లక్ష్మీనారాయణ తన భుజాలకు ఎత్తుకున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top