ముఖ్యమంత్రి ఎవరో తేల్చేసిన బెట్టింగ్ రాయుళ్లు..!

By Xappie Desk, November 27, 2018 20:37 IST

ముఖ్యమంత్రి ఎవరో తేల్చేసిన బెట్టింగ్ రాయుళ్లు..!

తెలంగాణలో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు పోటీ హోరాహోరీగా సాగుతోంది. ఇందుకు కారణం, ప్రతీ చోటా బలమైన అభ్యర్థులను ఆయా పార్టీలు దింపుతుండడమే. అయితే ఇప్పుడు ఏ స్థానంలో ఏ అభ్యర్థి గెలుస్తాడు అన్న విషయం పైన మన బెట్టింగ్ రాయలు జోరుగా పందేలు వేస్తున్నారట. ఒక వైపు వివిధ సర్వేలు బయటకు వస్తూ గెలుపు గుర్రాల వీల్లేనంటూ ఊహాగానాల నడుమ వారు వీటిని ఆసరాగా చేసుకొని కోట్లలో లావాదేవీలు జరుపుతున్నారు.
 
అభ్యర్థుల గెలుపోటములను అంచనాలు వేస్తూ వీరు చాకచక్యంగా డబ్బులు చేతులు మారుస్తున్నారు. ముఖ్యంగా సీనియర్లు - పార్టీ ముఖ్యులు ఉన్న స్థానాలపై ఆసక్తి బాగా పెరిగింది. కుల మతాల పరంగా ఓట్లను - వైఫల్యాలను - లాభ నష్టాలను బేరీజు వేస్తున్నారు. ఢీ అంటే ఢీ అంటూ తలబడుతున్న ఉద్ధండుల స్థానాలపై బెట్టింగ్ ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా టీఆరెఎస్, కాంగ్రెస్, టీడీపీ నేతల మధ్యనే పోటీ నెలకొనడంతో అందరూ కూడా వీరి మధ్యనే పందేలు వేస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే వీరందరి కన్ను ఎక్కువగా గులాబీ పార్టీ అభ్యర్థులపై నెలకొనగా కొంతమంది దీనిని ఆసరాగా చేసుకొని కూటమిపై ఎక్కువ మొత్తాన్ని వేస్తున్నట్లు తెలుస్తోంది.
 
ఇకపోతే హుజూర్ నగర్ లోని పీసీసీ చీఫ్ ఉత్తమకుమార్ బరిలో ఉన్నందున అక్కడ కూడా బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఈయనపై టీఆర్ ఎస్ నుంచి ఎన్నారై సైదిరెడ్డి పోటీ చేస్తున్నారు. సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిపై టీఆర్ ఎస్ తరుపున బరిలో ఉన్న కంచర్ల భూపాల్ రెడ్డి సైతం గట్టి పోటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. చివరిగా మహాకూటమి, టీఆరెఎస్ లలో ఏది గెలుస్తుంది అనే దాని మీద భారీ మొత్తంలో పందేలు సిద్ధంగా ఉన్నాయట.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop