చంద్రబాబు ని ఇంటికి పంపించేదం అని ప్రజలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్

చంద్రబాబు ని ఇంటికి పంపించేదం అని ప్రజలకు పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్

ఇటీవల ముమ్మిడివరం గ్రామం లో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులపై మరియు ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు పై తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యులు ప్రజలకు మేలు చేయాల్సి పోయి ప్రజలపై దాడి చేయడం రౌడీయిజం చేయడం ఆకు రౌడీల... వీధి రౌడీలా ప్రవర్తించడం దారుణమని అటువంటి శాసనసభ్యులను 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అదుపు చేయకపోవడం దురదృష్టకరమని పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఆడపడుచులను జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లి కొడుతుంటే సస్పెండ్‌ చేయలేని వ్యక్తి ఏం సీఎం అని చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అధికారులపై ఇష్టం వచ్చినట్లు తిడుతుంటే ఖండించలేని నువ్వా సీఎం అంటూ మండిపడ్డారు. దళితులను కులాల పేరు పెట్టి తిడుతుంటే, మీడియా ప్రతినిధులను అమ్మనా బూతులు తిడుతుంటే కనీసం యాక్షన్ తీసుకోలేని సీఎం మనకెందుకు అన్నారు. ఇలాంటి సీఎం మనకు వద్దు అని రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు సెలవిద్దామన్నారు. ముఖ్యంగా ఇటీవల చంద్రబాబు ప్రసంగిస్తూ రాష్ట్ర యువత త్యాగాలు చేయాలని ఏపీ యువతను ఉద్దేశించి చేసిన కామెంట్లపై పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ యువకులు త్యాగాలు చేస్తే మీ అబ్బాయి ఏపీ మంత్రి నారా లోకేష్ మాత్రం రాజధాని రోడ్లపై తిరుగుతాడా అని నిలదీశారు. అన్ని విధాలా చంద్రబాబు హయాంలో విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రం మరింత నష్టపోయిందని..రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ని ఇంటికి పంపించేయాలని. మన పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top