తర్వాత నువ్వు మిరపకాయలు పండించు కోవాల్సిందే కేసీఆర్ పై సెటైర్స్ వేసిన నారాయణ..!

By Xappie Desk, November 28, 2018 10:14 IST

తర్వాత నువ్వు మిరపకాయలు పండించు కోవాల్సిందే కేసీఆర్ పై సెటైర్స్ వేసిన నారాయణ..!

ఇటీవల ప్రకాశం జిల్లాలో పర్యటించిన సిపిఐ నారాయణ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పై విమర్శల వర్షం కురిపించారు. భారతీయ జనతా పార్టీ రూపంలో దేశానికి ప్రమాదం పొంచి ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోడీకి తన భార్యపై ఎంత ప్రేమ ఉందో అయోధ్యలో రామాలయం అంటే అంత ప్రేమ ఉందని..ఎన్నికలు వస్తున్న సమయంలోనే రామాలయం అంశం తెరపైకి తెస్తున్నారని ఇంత నీచమైన రాజకీయాలు ఓట్ల కోసం చేయటం ప్రజల మధ్య గొడవలు పెట్టడం దారుణమని ఆరోపించారు సిపిఐ నారాయణ.
 
సీబీఐని ఇస్కో అంటే ఉస్కో అనేలా తయారు చేశారని విమర్శించారు. సీబీఐ, ఆర్బీఐ, ఎన్నికల వ్యవస్థలను మోదీ తన వంటింటి కుందేలు మాదిరిగా తయారు చేశారని ధ్వజమెత్తారు.వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఇక ఎన్నికలు ఉండవని అన్నారు. రఫెల్‌ విమానాల స్పీడ్‌ కన్నా మోదీ అవినీతి ఇంకా స్పీడ్‌గా వెళ్తుందని నారాయణ ధ్వజమెత్తారు. ఇదే క్రమంలో తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కూడా నిప్పులు చెరిగారు. అంత తొందరగా ఎన్నికలకు ఎందుకు వెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముందస్తు ఎన్నికల కి వెళ్లిన కేసీఆర్ ఎన్నికలు అయిపోయాక ఫామ్ హౌస్ కి వెళ్లి మిరపకాయ పంట వేసుకుని పండించుకుంటారు అని నారాయణ జోస్యం చెప్పారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top