పవన్ కళ్యాణ్ పై అదిరిపోయే కామెంట్ చేసిన వైసిపి నేత విజయసాయిరెడ్డి..!

By Xappie Desk, November 28, 2018 10:24 IST

పవన్ కళ్యాణ్ పై అదిరిపోయే కామెంట్ చేసిన వైసిపి నేత విజయసాయిరెడ్డి..!

ప్రశ్నించడానికి పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాను అని జనసేన పార్టీ స్థాపించిన తొలి రోజులలో తెగ ఊదరగొట్టే పవన్ కళ్యాణ్...2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు.. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం అవినీతి గానీ చెప్పిన పని చేయకపోతే నేనే ఆయన కాలర్ పట్టుకుని అడుగుతానని అప్పట్లో జరిగిన చాలా బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అయితే ఆ తర్వాత టిడిపి అధికారంలోకి వచ్చిన..కొన్ని జరిగిన పరిణామాల వల్ల తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చేశారు పవన్ కళ్యాణ్.
 
ఇదిలా ఉండగా విభజనతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన అవినీతి విషయంలో ఎప్పుడూ కూడా పవన్ కళ్యాణ్... చంద్రబాబు ని కాలర్ పట్టుకుని ప్రశ్నించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం తన పార్టీ తరపున ప్రచారం లో పాల్గొంటూ రాబోయే ఎన్నికలలో నేను ముఖ్యమంత్రి అవుతానని ప్రజలకు తెలియ చేస్తూ మరో పక్క ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై దారుణంగా విమర్శలు చేస్తున్నారు పవన్.
 
దీంతో ప్రతిపక్షంలో ప్రజలు తనను కూర్చోబెట్టిన క్రమంలో ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తున్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్ పై పవన్ కళ్యాణ్ లేనిపోని విమర్శలు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ పార్టీ కి చెందిన ఎంపీ విజయ సాయి రెడ్డి పవన్ మీద కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తన సినిమాలకు కాల్షీట్లు ఇచ్చినట్టుగా అప్పుడప్పుడు బయటకు వచ్చి సినిమాల్లో నటించినట్టుగా చేతులు, కాళ్ళు ఊపుతూ ఏదో నాలుగు డైలాగులు చెప్పినంత మాత్రాన జనం ఎవరూ ఆయన్ని నమ్మట్లేదు అని ఆయన్ని నిజంగా ప్రజల్లో ఉండి వారి సమస్యల మీద పోరాటం చేయమనండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు.Top