జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి సంచలన కామెంట్స్ చేసిన జేడీ..!

By Xappie Desk, November 28, 2018 14:00 IST

జగన్ పై జరిగిన హత్యాయత్నం గురించి  సంచలన కామెంట్స్ చేసిన జేడీ..!

సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ పొలిటికల్ ఎంట్రీ గురించి ఇటీవల అనేక వార్తలు వస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. చాలామంది జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీ పెడుతున్నట్లు కామెంట్లు చేశారు..అయితే ఈ క్రమంలో అందరికీ షాకిచ్చి లోక్‌స‌త్తా పార్టీలో చేరారు. అంతేకాకుండా ఆంధ్రరాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానని జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అంతేకాకుండా నాకున్న ఆలోచనలకు దగ్గరగా లోక్‌స‌త్తా పార్టీ లో వాతావరణం అనుకూలంగా ఉండటంతో పార్టీలో చేరానని స్పష్టం చేశారు.
 
ఇంకా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ...భవిష్యత్తు మొత్తం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని ఎన్నికల నిబంధనలకు లోబడే పోటీ చేస్తానని.. పీపుల్స్ మ్యానిఫెస్టో ద్వారా ప్ర‌జ‌ల్లోకి వెళ‌తామ‌ని జేడీ పేర్కొన్నారు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా బ‌రిలోకి దిగుతామా లేక‌, ఏ పార్టీనైన క‌లుపొని పోతామా అనేది త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని జేడీ అన్నారు. ప్ర‌జ‌లంద‌రికి వైద్యం, విద్య‌, అందించ‌డానికి కృషి చేస్తామ‌ని, వ్య‌వ‌సాయం లాభ‌సాటి చేసేవిధంగా అడుగులువేస్తామ‌ని, రైతుల క‌న్నీళ్ళు తుడ‌వ‌డ‌మే తమ ప్ర‌ధ‌మ క‌ర్త‌వ్యం అని జేడీ అన్నారు. ఇక ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పై జ‌రిగిన దాడి పై స్పందిస్తూ.. ఆ దాడి ఏపీ స‌ర్కార్ వైఫ‌ల్య‌మే అని తేల్చేశారు. ఏ రాష్ట్రంలోనైనా శాంతిభద్రతలు లోపిస్తున్నాయి అంటే అది కచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వానిదే తప్పు అని పేర్కొన్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top