జగన్ ని రెచ్చగొట్టాలని నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న పవన్..!

జగన్ ని రెచ్చగొట్టాలని నానా విధాలుగా ప్రయత్నాలు చేస్తున్న పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిపోతున్నారు. రోజురోజుకి రాజకీయాలలో పరిణితి చెందుతూ ప్రజల నాడిని పట్టుకునే విధంగా తనదైన శైలిలో కామెంట్లు చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్నే కార్యక్రమానికి తెరలేపారు. ప్రజా పోరాట యాత్ర అంటూ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అనేక చోట్ల పర్యటించిన సంగతి మనకందరికీ తెలిసినదే. యాత్రలో భాగంగా మొదట్లో ఏపీ సీఎం చంద్రబాబు పై తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులపై టార్గెట్ చేసి తనదైన శైలిలో విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్. ఎన్నికలు దగ్గరకొస్తున్న కొలది తన వ్యూహాన్ని మార్చి ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ ని టార్గెట్ చేస్తూ జగన్ పై దారుణంగా విమర్శలు చేసి..రాష్ట్ర ప్రజల మధ్య హాట్ టాపిక్ గా నిలవాలని చాలా తెలివిగా జగన్ ని రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ తన తాజా పర్యటనలో వ్యవహరిస్తున్నారు.
 
గత కొన్ని రోజుల నుండి పవన్ కళ్యాణ్..జ‌గ‌న్ మ‌గ‌త‌నం, ధైర్యం , కులం గురించి ఇష్టం వ‌చ్చిన‌ట్లు విమ‌ర్శ‌లు చేస్తున్నా జ‌గ‌న్ వాట‌న్నింటినీ ప‌ట్టించుకోవ‌డంలేదు. గ‌తంలో త‌న మీద ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చిన జ‌గ‌న్ ఇప్పుడు మాత్రం అస‌లు స్పందించ‌డంలేదు. అందుకే ప‌వ‌న్ నిరాశ‌లో ఉన్నారు. జ‌గ‌న్‌ను విమ‌ర్శించి పాపులారిటీ సంపాదించుకోవాల‌ని చూస్తున్న ప‌వ‌న్ ఆశ‌లు నెర‌వేర‌డంలేదు. దీంతో జగన్ స్పందించకపోవడంతో...పవన్ కళ్యాణ్ తాజాగా కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసి తన ప్రస్తుత పర్యటనలో చంద్రబాబుతో జగన్ ని పోలిస్తు విమర్శలు చేయడం మొదలుపెట్టారు... మరి పవన్ కళ్యాణ్ చేస్తున్న కామెంట్లపై జగన్ ఇప్పుడైనా స్పందిస్తారో లేదో చూడాలి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top