నందమూరి ఫామిలీ సైలెంట్ గా ఉన్నారే ?

By Xappie Desk, November 29, 2018 13:26 IST

నందమూరి ఫామిలీ సైలెంట్ గా ఉన్నారే ?

ఏపీ సీఎం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై వైసీపీ పార్టీ నాయకుడు జోగి రమేష్ విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల పూలే వర్ధంతి సందర్భంగా విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జోగి రమేష్ చంద్రబాబు పై సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే..ఈనాడు చంద్రబాబు అటువంటి ఆత్మగౌరవం కలిగిన పార్టీని ఢిల్లీ నాయకుల కాళ్ల దగ్గర పెట్టారని..తెలుగు వారిని అడ్డగోలుగా విభజించిన వారితో చేతులు కలిపి ఫోజులివ్వడం...వాళ్ల కాలని పట్టుకోవడం సిగ్గుచేటు రాజకీయాలని చంద్రబాబు..... రాహుల్ గాంధీ మరియు సోనియాగాంధీ లతో బేటి అవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. గత నాలుగు సంవత్సరాలు మోడీ తో చేతులు కలిపి...ఎన్నికలు వస్తున్న తరుణంలో తన స్వార్ధ రాజకీయాలకోసం అవకాశవాదిగా మారుతూ అటు ఇటు అడుగులు వేస్తూ ఆంధ్ర ప్రజలను తప్పుదోవ పట్టించాడనికి చంద్రబాబు అనేక కుయుక్తులు పన్నుతున్నారని జోగి రమేష్ చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. ఇక చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాల గురించి ఎన్టీఆర్ అప్పట్లో చెప్పింది అక్షరాలా నిజమవుతోందని జోగి రమేష్ స్పష్టం చేశారు. నందమూరి కుటుంబం ఎందుకు ఈ విషయంలో మౌనంగా ఉందో చెప్పాలని ప్రశ్నించారు. ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీకి వ్యతిరేకంగా పోరాడుతోందని వైఎస్ జగన్ మాత్రమేనని పునరుద్ఘాటించారు.Top