లగడపాటి అసలు సర్వే బయట పెట్టాడు !

By Xappie Desk, November 29, 2018 13:31 IST

లగడపాటి అసలు సర్వే బయట పెట్టాడు !

దేశంలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో చాలాచోట్ల సర్వేలు జరుగుతున్నాయి. ఈ సర్వేలు నిర్వహిస్తున్న వారిలో మీడియా సంస్థలతో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా కలసి సర్వే లు చేయడం గమనార్హం. అయితే దేశంలో ఎన్ని సంస్థల సర్వేలు ఉన్నా కానీ లగడపాటి సర్వే కి చాలా వెయిటేజ్ ఉంటుంది రాజకీయాలలో. అందుకే ఆయనను ఆక్టోపస్ అంటుంటారు. కచ్చితంగా లగడపాటి సర్వే ప్రభావం ప్రజలపై కూడా పడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు..బడా బడా మీడియా సంస్థలు లగడపాటి సర్వే అంటూ ప్రత్యేకంగా ఈయన గురించి బులిటెన్లు కూడా ప్రసారం చేస్తుంటారు. దీంతో ఇంత కచ్చితమైన సర్వే చేసే లగడపాటి తన వెనుక ఉన్న టీం మెంబర్ ల గురించి...మరియు వారు ఏ విధంగా సర్వే చేస్తారు వంటి విషయాల గురించి ఇటీవల వివరణ ఇచ్చారు. సర్వేల విషయంలో లగడపాటి ఏమన్నారంటే...''చాలా మంది ఎక్కువ మంది అభిప్రాయం తీసుకుంటే సర్వే సరిగ్గా వస్తుందని అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. సర్వే శాంపిల్ పెద్దదా చిన్నదా అన్నది ప్రధానం కాదు. మనం సర్వే కోసం ఎంచుకునే మనుషులు ఎవరన్నది అత్యంత కీకలం.
 
ఒక ఐదు నియోజకవర్గాల్లో 50 మందిని అడిగి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితమేంటో చెప్పేయొచ్చు. ఆ 50 మందిని ఎన్నుకోవడంలోనే సర్వే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పలేం కానీ.. ఎవరు గెలుస్తారో మాత్రం చెప్పేయొచ్చు. నేరుగా వ్యక్తులతో మాట్లాడి చేసే సర్వేలకే క్రెడిబిలిటీ ఉంటుంది. సెల్ ఫోన్ లతో చేసే సర్వేలు సరైన ఫలితాలు రావు. ఇటీవలే మా టీం కర్ణాటకలో సెల్ ఫోన్ సర్వేతో పాటు ఫీల్డ్ సర్వే కూడా చేపట్టింది. ఆంధ్రప్రదేశ్-తెలంగాణల్లో కూడా అలానే చేశాం. ఐతే రెంటి ఫలితాలూ భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఫోన్ సర్వే అనేది బోగస్ అని చెప్పొచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. ఓటర్లలో సైలెంట్ ఓటర్లు.. వోకల్ ఓటర్లు అని రెండు రకాలు ఉంటారు. సైలెంట్ ఓటర్ల నాడి పట్టుకోవడం చాలా కష్టం. వాళ్ల వల్లే గత పర్యాయం తెలుగుదేశం గెలిచింది. వోకల్ ఓటర్ల అభిప్రాయాల్ని బట్టి అందరూ గత ఎన్నికలు హోరాహోరీగా సాగుతాయనుకున్నారు. కానీ ఫలితాన్ని నిర్దేశించింది సైలెంట్ ఓటర్లు. వీరి మనోగతం మారుతూ ఉంటుంది. వాళ్లు న్యూస్ ఛానెళ్లు చూడరు. వారి నాడి పట్టుకోవడం కష్టం. వారి పల్స్ పట్టుకోవడం సర్వేకు కీలకం. ఎన్నికలకు 10-15 రోజుల ముందు చేసే సర్వేలు కచ్చితంగా ఉంటే పబ్లిక్ పల్స్ ఎలా ఉందనేది తెలుస్తుంది'' అని లగడపాటి అన్నాడు. అంతేకాకుండా దేశంలో త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల సర్వేల ఫలితాలు తమ దగ్గర ఉన్నాయని...ఎప్పుడైతే ఆయా రాష్ట్రాల్లో పోలింగ్ అయిపోతదో...ఆ సమయంలో బయటపెడతానని పేర్కొన్నారు లగడపాటి.
 Top