ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందా ?

By Xappie Desk, November 29, 2018 13:43 IST

ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందా ?

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం లో మహా కూటమి నిర్వహించిన భారీ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో ఏపీ సీఎం చంద్రబాబు వేదిక పంచుకున్నారు. దీంతో ఈ సన్నివేశం చూసిన చాలా మంది రాజకీయ నాయకులు పైనున్న ఎన్టీ రామారావు ఈ బహిరంగ సభ ను పై నుండి చూసి ఉండి ఉంటే ఆయన ఆత్మ కచ్చితంగా క్షోబిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సభలో చంద్రబాబు రాహుల్ ని పొగడ్తల వర్షం తో ముంచెత్తారు. మరియు అదే విధంగా తానుకు తాను సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో వేదిక పంచుకోవడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు చంద్రబాబు. దీంతో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై చాలామంది రాజకీయ విశ్లేషకులు..చంద్రబాబు దారుణంగా రాజకీయాల్లో దిగజారిపోయారని..ఎంతో అనుభవం రాజకీయాల్లో చంద్రబాబు కి ఉన్న చంద్రబాబు కంటే చాలా లేటుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన రాహుల్ గాంధీతో తాను వేదిక పంచుకునందుకే ఇలా ఫీలవుతున్నారు అంటే..చంద్రబాబు గ్రాఫ్ ఏవిధంగా పడిపోయిందో అందరికీ అర్థమవుతుందని చాలా మంది రాజకీయ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top