బాబు ని చాలా తెలివిగా లాక్ చేసిన కెసిఆర్ !

బాబు ని చాలా తెలివిగా లాక్ చేసిన కెసిఆర్ !

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రచారంలో భాగంగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మహాకూటమి అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నుండి జరుగుతుందని మళ్లీ తెలంగాణ ప్రాంతంలో రాజకీయ దుర్మార్గుల పెత్తనం ప్రారంభమవుతుందని కామెంట్లు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఖమ్మం జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు మరియు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ..మరియు ఇతర నాయకులు సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు బహిరంగ సభలో చేసిన ప్రసంగం రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఖమ్మం జిల్లా భారీ బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ..ప్రజాకూటమి గెలిస్తే తాను తెలంగాణపై ఆధిపత్యం చేయను. తెలంగాణ నాకు ప్రియమైన ప్రాంతం. నేను ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటాను.
 
ఇక్కడ పోటీ చేయను - పెత్తనం కూడా చేయను... అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అందరిలో చర్చుకు దారితీశాయి..అంటే కేసీఆర్ చంద్రబాబు పెత్తనం మనకొద్దు. మనపాలన మనం చేసుకుందాం అని చేసిన ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్లింది. ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. అది అర్థం చేసుకున్న చంద్రబాబు ఈ విధంగా స్పందించినట్లు తెలుస్తోంది. మొత్తం మీద కేసిఆర్ వేసిన డైలాగులు చంద్రబాబు గురించి అని...తెలంగాణ ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. ఏది ఏమైనా ఎన్నికల క్రమంలో చంద్రబాబు ని చాలా తెలివిగా లాక్ చేశారు టిఆర్ఎస్ అధినేత కెసిఆర్. ఖమ్మం జిల్లాలో జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు కనీసం ఒక్క మాట కూడా కెసిఆర్ పై మాట్లాడలేకపోయారు..ఎక్కడ కేసిఆర్ ని తిడితే ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రాంతా ప్రజా లను తిట్టినట్లు తెలంగాణ ప్రజలలో భావన కలుగుతుందేమోనని కేసిఆర్ పై ఒక్క మాట మాట్లాడలేకపోయారు చంద్రబాబు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top