పోలవరం ప్రాజెక్టు పై సంచలనకరమైన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు..!

పోలవరం ప్రాజెక్టు పై సంచలనకరమైన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు..!

దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగన్వాడి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు పై సంచలన కరమైన వ్యాఖ్యలు చేసింది. విభజనతో నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ విషయంలో గతంలో కేంద్రమే చూసుకుంటుందని విభజన చట్టంలో పేర్కొన్న సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మేమే చూసుకుంటామని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడంతో..కేంద్రం పోలవరం ప్రాజెక్టు విషయంలో తలదూర్చ లేదు. అయితే మరోపక్క పోలవరం ప్రాజెక్టు విషయంలో ఒడిశా రాష్ట్రం ఇటీవల సుప్రీంకోర్టు వెళ్లిన నేపథ్యంలో సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది.
 
ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా నిర్మాణం వుండకూడదనీ..ప్రాజెక్టు ఆపితే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? నిర్మాణం ఆపితే కలిగే నష్టం కంటే..నిర్మాణం వల్ల జరిగే నష్టమే ఎక్కవని ఒడిషా ప్రభు్త్వం పేర్కొన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత వుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్ 2వ తేదీ సోమవారం నాటికి వాయిదా వేసింది. దీంతో ఈ విషయం ఏపీ రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top