అప్పుడే ఇద్దరు మంత్రులను కన్ఫర్మ్ చేసేసిన కెసిఆర్..?

By Xappie Desk, November 30, 2018 09:55 IST

అప్పుడే ఇద్దరు మంత్రులను కన్ఫర్మ్ చేసేసిన కెసిఆర్..?

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్న టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. తన ప్రచార పర్వం లో భాగంగా ఒక పక్క మహాకూటమి నాయకులపై మరోపక్క ఏపీ సీఎం చంద్రబాబు పై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ తెలంగాణ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు. ఇదే క్రమంలో కేసీఆర్ ఏ ప్రాంతంలో ప్రచారం చేస్తున్నారు ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుడు గురించి ఆయన గత నాలుగు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేస్తూ ప్రజలను స్థానిక నాయకులను ఒకే తాటిపై ఉంచుతూ రానున్న రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది అన్న విషయాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేరీతిలో ప్రసంగిస్తూ...ప్రజలకు హామీల వర్షం కురిపిస్తున్నారు కేసిఆర్.
 
ఈ క్రమంలో ఇటీవల వనపర్తి నియోజకవర్గం లో కేసిఆర్ ఆ ప్రాంతానికి సంబంధించిన నిరంజన్ రెడ్డి గురించి చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి.నిరంజన్ రెడ్డి పట్టుబట్టి చెరువులు నింపిండు. వనపర్తి జిల్లా కేంద్రం అయింది కాబట్టి ట్రిపుల్ ఐటీ - మెడికల్ కాలేజీ వస్తాయి. నిరంజన్ రెడ్డిని గెలిపిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉండడు. ఆయన స్థాయి పెరుగుతది* అని అన్నారు. నిరంజన్ రెడ్డిని గెలిపించుకుని వనపర్తిని మరింత అభివృద్ధి చేసుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మరియు అదేవిధంగా ఇటీవల చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన కేసీఆర్ ఆ నియోజకవర్గానికి సంబంధించిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడు బాల్క సుమన్ గురించి షాకింగ్ కామెంట్ చేశారు. సుమన్ నా ఇంట్లో బిడ్డలాంటివాడు. మీ ప్రాంతం అభివృద్ధికి ఏం కావాలన్నా..నాతోని కొట్లాడి తెచ్చేంత శక్తి సుమన్కు ఉంది. భారీ మెజార్టీతో గెలిపించండి. ఆయన గెలిస్తే సాధారణ ఎమ్మెల్యేగా ఉండడు. ఉన్నతమైన స్థానంలో ఉంటడు. మీకు చాలా లాభం జరుగుతది అని వ్యాఖ్యానించారు కేసీఆర్. వనపర్తి తర్వాత మళ్లీ ఇక్కడే కేసీఆర్ ఇలా మాట్లాడాడు. సుమన్ గెలిస్తే మంత్రి అవుతాడు అని కేసీఆర్ దాదాపు స్పష్టం చేసినట్టే అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
 Top