అంతర్జాతీయ స్థాయిలో నారా లోకేష్ కి ర్యాంక్..!

By Xappie Desk, November 30, 2018 09:58 IST

అంతర్జాతీయ స్థాయిలో నారా లోకేష్ కి ర్యాంక్..!

టిడిపి అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు ఏపీ మంత్రి నారా లోకేష్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఇటీవల ప్రపంచంలోనే ప్రముఖ పేరుగాంచిన సంస్థ అయినా 'ఎ పొలిటికల్‌ సంస్థ' ప్రస్తుత యువతరంలో నాయకులుగా ఉన్న వారు ఎవరు ప్రజలను అత్యంత ప్రభావితం చేస్తున్నారు అని సర్వే చేసిన దానిలో ఏపీ మంత్రి నారా లోకేష్ కి స్థానం దక్కడం తో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంతోషంలో మునిగిపోయారు. 'ఎ పొలిటికల్‌ సంస్థ' 2018 సంవత్సరానికి గాను విడుదల చేసిన 100 మంది భవిష్యత్తు నాయకుల జాబితాలో మొదటి 20 స్థానాల్లో ఆయనకు చోటు దక్కిందని వెల్లడించారు.
 
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్ గురించి సోషల్ మీడియాలో తెగ ఊదరగొడుతున్నారు..అప్పట్లో తండ్రి చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ పటం లోనే ప్రత్యేకమైన స్థానం కల్పిస్తే ఆయన తనయుడు నారా లోకేష్ తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకుంటున్నారు అని కామెంట్ చేస్తున్నారు. మిగతా అన్ని దేశాల్లో 35 ఏళ్లలోపు యువ నాయకుల పాలన, పనితీరు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించిన వారిని మాత్రమే ఈ సంస్థ ఎంపిక చేసింది. గొప్ప గొప్ప మార్పుల కోసమని జరిపిన అన్వేషణ లో, అందరు నాయకులని కలిపే దిశగా ఈ సంస్థ పని చేస్తుంది. 140 దేశాల్లో ఎ పొలిటికల్‌ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో ఈ విషయం తెలుసుకున్న నారా లోకేష్ చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top