అప్పుడు నా చొక్కా పట్టుకొని ప్రశ్నించవచ్చు అంటున్న పవన్..!

అప్పుడు నా చొక్కా పట్టుకొని ప్రశ్నించవచ్చు అంటున్న పవన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల అమలాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం భారతీయ ప్రజలకు ఎటువంటి హక్కు ఇచ్చింది అన్న విషయంపై సామాన్యులకు అర్థమయ్యే రీతిలో తనదైన శైలిలో తెలియజేశారు. ప్రపంచంలోనే మనకున్న రాజ్యాంగం ఎక్కడా లేదని నాయకుడు తప్పు చేస్తే కచ్చితంగా ప్రజలు చొక్కా పట్టుకుని ప్రశ్నించే అవకాశం భారతీయ రాజ్యాంగం ఇచ్చిందని..కనుక రానున్న రోజుల్లో జనసేన పార్టీ నాయకులు గానీ నేను గానీ తప్పు చేస్తే కచ్చితంగా చొక్కా పట్టుకొని ప్రశ్నించే హక్కు మీకు ఉందని పేర్కొన్నారు పవన్. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం లోని చేనేత కళాకారులతో మాట్లాడుతూ, చేనేత చాలా గొప్ప అరుదైన కళ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హస్త కళ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకే తాను పంచె కడుతున్నట్టు చెప్పారు.
 
ఇప్పటివరకు కూడా కులం పేరుతో గెలిచిన నాయకులు, ఇక్కడ న్యాయం చేసిన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అసలే లేవన్నారు. ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారు కానీ ప్రజలని, ప్రజా సమస్యలని పట్టించుకునే నాయకులే లేరని పవన్ విమర్శించారు. ప్రస్తుతం సమాజంలో అవినీతి విచ్చలవిడి అవుతుందని కనుక ప్రజలే మేలుకొని ప్రభుత్వాలను నిలదీసే రోజులు రావాలని అన్నారు పవన్. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీల నాయకులు గతంలో 2014 ఎన్నికల్లో బిజెపి చంద్రబాబు తప్పు చేస్తే వారి చొక్కా కాలర్ పట్టుకుని ప్రజల తరఫున ప్రశ్నిస్తానని ప్రజలకు మాట ఇచ్చి..ఇప్పుడేమో నేను అధికారంలోకి వస్తే నేను తప్పు చేస్తే ప్రజలు నన్ను కాలర్ పట్టుకొని ప్రశ్నించవచ్చు అని నువ్వు మాట్లాడాటం హాస్యాస్పదం అన్ని అంటున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top