అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో తేల్చేసిన కేసీఆర్...!

అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లారో తేల్చేసిన కేసీఆర్...!

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్న విషయం గురించి ఇటీవల కేసిఆర్ చేసిన కామెంట్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో సంచలనం సృష్టించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండోసారి ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ వల్ల వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
 
ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఎందుకు ముందస్తు ఎన్నికలకు కెసిఆర్ వెళ్లారు అని చేస్తున్న కామెంట్లకు తనదైన శైలిలో కేసీఆర్ ప్రజలకు అర్థమయ్యే రీతిలో వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ అభివృద్దికి అడుగడుగునా అడ్డుపడుతోందని, ఆ పార్టీ నేతల వైఖరి ప్రజా వ్యతిరేకంగా ఉందని, అందువల్లే ఎన్నికలలో తేల్చుకోవాలని అనుకున్నామని ఆయన అన్నారు.
 
ఈ ఎన్నికలను తేలికగా తీసుకోమని ఆయన అన్నారు. కాంగ్రెస్,టిడిపిలను నమ్మితే తెలంగాణ పరిస్థితి అంతే సంగతి అవుతుందని ఆయన హెచ్చరించారు.58 ఏళ్ల టీడీపీ, కాంగ్రెస్‌ పాలనలోని కరెంట్‌ సరఫరాకు ఇప్పటి సరఫరాకు తేడా గమనించాలన్నారు. ఈ సారి బ్రహ్మాండమైన మెజారిటీతో టీఆర్‌ఎస్‌ గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.
 
కానీ పార్లమెంట్‌ స్థానాలు కూడా గెలుచుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు ఢిల్లీ పెత్తనం అవసరమా? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికలలో తెలంగాణ ప్రజలను అణగదొక్కాలని చూసిన నాయకులకు పార్టీలకు ఆ సమయంలో దిమ్మతిరిగిపోయే విధంగా తీర్పునిచ్చారు ఇదే క్రమంలో రానున్న ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు అదే రీతిలో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీలకు ఎన్నికలలో తమ ఓటు ద్వారా తీర్పు ఇస్తారు అని తెలంగాణ నేతలు పేర్కొన్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top