టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకున్నా గ్రామస్తులు..!

టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రచారాన్ని అడ్డుకున్నా గ్రామస్తులు..!

మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ పార్టీల రాజకీయ నాయకులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఈ నేపధ్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఖమ్మం జిల్లా ప్రాంతానికి చెందిన బాణోత్ మదన్ లాల్ కూడా తనకు టిఆర్ఎస్ పార్టీ కేటాయించిన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా బాణోత్ మదన్ లాల్ కి చేదు అనుభవం ఎదురయింది. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను గ్రామస్థులు అడ్డుకున్నారు. ప్రచారంలో భాగంగా శుక్రవారం మదన్ లాల్ కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండాకి వెళ్లారు. కాగా.. ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. లంబాడీలను కించపరిచేవిధంగా మాట్లాడి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వచ్చారంటూ మండిపడ్డారు. మా ప్రాంతంలో పర్యటించ వద్దని వెనక్కి వెళ్లిపోవాలని ఆందోళనలు నిరసనలు చేపట్టారు. ప్రచారం చేస్తున్న కాన్వాయ్ కి అడ్డుతగిలి మరి ఆ ప్రాంత ప్రజలు నిరసనలు చేపట్టడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది దీంతో విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకోవడంతో..అనంతరం మదన్ లాల్ తన ప్రచారాన్ని కొనసాగించారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top