చంద్రబాబుని చూసి కాంగ్రెస్ రెచ్చిపోతుంది అని కామెంట్లు చేసిన హరీష్..!

చంద్రబాబుని చూసి కాంగ్రెస్ రెచ్చిపోతుంది అని కామెంట్లు చేసిన హరీష్..!

ఏపీ సీఎం చంద్రబాబు పై టిఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రచారంలో ఇటీవల హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై నుండి తెలంగాణ ప్రజలు చంద్రబాబు ని తరిమేస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చి మళ్లీ తెలంగాణ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని హరీష్ రావు కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి వంటరిగా పోటీ చేసే దమ్ము లేక చంద్రబాబుని తెచ్చుకుని భుజాలు ఎగరేస్తున్నారు అని మండిపడ్డారు.
 
మన రాష్ట్రం మనకు వచ్చిన తర్వాత కరెంట్‌ కష్టాలు పడుతున్నా మౌనంగా చూసిన బాబు, ఇతర ప్రాంతాల నుంచి కరెంట్‌ సరఫరాకు కూడా అడ్డుపుల్ల వేశారని గుర్తు చేశారు. అయితే కేసీఆర్‌ చతురతతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ తెప్పించుకొని ప్రజలకు కరెంట్‌ కష్టాల నుండి విముక్తి కలిగించారని అన్నారు. అలాగే సాగునీటికి పరితపించిన తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటే అడుగడుగునా చంద్రబాబు అడ్డుకట్ట వేశారని ఆరోపించారు.
 
గోదావరి, కృష్ణా నదుల నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను ఇవ్వకుండా కేంద్ర జలవనరుల మండలి వద్ద బాబు ఫిర్యాదులు చేశారన్నారు. అలాంటి చంద్రబాబు భాగస్వామిగా ఉన్నకూటమికి ఓటేస్తే తెలంగాణ అభివృద్ధి సాధ్యం అవుతుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌పై చంద్రబాబు నాయుడుకు ఇంకా మోజు తీరలేదని, ఇక్కడి సంపదను దోచుకో మరిగిన ఆయన తెలంగాణలో మళ్లీ పెత్తనానికి తహతహలాడుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top