మీ అన్న పేరు చెప్పుకోలేకపోయావు రాష్ట్రానికి ఇంకేం చేస్తావ్ పవన్ పై అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు..!

మీ అన్న పేరు చెప్పుకోలేకపోయావు రాష్ట్రానికి ఇంకేం చేస్తావ్ పవన్ పై అనిల్ కుమార్ యాదవ్ విమర్శలు..!

ఇటీవల వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ ప్రాంతంలో జరిగిన నయవంచన దీక్ష లో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఊహించని రీతిలో కామెంట్లు చేశారు. ముఖ్యంగా ఇటీవల పవన్ కళ్యాణ్ జగన్ పై దారుణంగా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి తగిన రీతిలో అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్లు వేసారు. ఇటీవల జనసేన పార్టీ భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నేను సామాన్యుడు కానిస్టేబుల్ కొడుకుని అని వ్యాఖ్యానిస్తున్న వ్యాఖ్యలను అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు. రానున్న ఎన్నికల్లో ఓట్ల కోసమే పవన్ కళ్యాణ్ ఈ విధంగా కానిస్టేబుల్ కొడుకు ను అన్నిచెప్పుకుంటున్నారని...విమర్శించారు. తన అన్నయ్య చిరంజీవి పేరు చెప్పుకోలేని పవన్‌ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు.
ప్రతి సభలోనూ కులాన్ని ప్రస్తావించే నాయకుడే పవన్ కళ్యాణ్ అని అనిల్ ధ్వజమెత్తారు. పవన్ సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా నటిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. వైఎస్‌ జగనే లక్ష్యంగా టీడీపీ, కాంగ్రెస్‌, జనసేనలు పని చేస్తున్నాయని, ప్రజలు జాగ్రత్త తో వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని..ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన భారీ బహిరంగ సభలో రాష్ట్రాన్ని అన్ని విధాల మోసం చేసి..రాష్ట్రాన్ని దారుణంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ తో చేతులు కలిపిన ఏపీ సీఎం చంద్రబాభే..జనసేన పార్టీ మాతో ఉందని బహిరంగంగానే తెలియజేశారని అనిల్ కుమార్ యాదవ్ ప్రజలకు తెలియజేశారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top