తిరుపతిలో తెలంగాణ ఎన్నికల విషయంలో సంచలన కామెంట్ చేసిన లగడపాటి..!

తిరుపతిలో తెలంగాణ ఎన్నికల విషయంలో సంచలన కామెంట్ చేసిన లగడపాటి..!

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక సర్వేలు ప్రముఖ మీడియా సంస్థలు ప్రైవేట్ సంస్థలు నిర్వహించాయి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రముఖ నేత ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు ఉన్న లగడపాటి సర్వే గురించి తెలుగు ప్రజలు మరియు మీడియా సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
 
ఈ నేపథ్యంలో ఇటీవల తిరుపతిలో మీడియాతో మాట్లాడిన లగడపాటి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో తాను నిర్వహించిన సర్వే పూర్తయిందని డిసెంబర్ 7వ తారీఖున ఆ సర్వే ఫలితాలు విడుదల చేస్తానని లగడపాటి తెలియజేశారు. ఇంకా లగడపాటి మాట్లాడుతూ తెలంగాణ లో జరగబోయే రెండో అసెంబ్లీ ఎన్నికలలో ఎనిమిది నుండి ప‌ది మంది స్వ‌తంత్రులు గెలుస్తార‌ని చెప్పి రాజ‌కీయ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అంతే కాకుండా రోజుకు ఇద్దరు గెలవబోయే స్వతంత్ర అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తానని చెప్పి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నుంచి స్వతంత్ర అభ్యర్థి శివకుమార్ రెడ్డి, అదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి అనీల్ కుమార్ జాదవ్ గెలుస్తారని ప్రకటించారు.
 
దీంతో ల‌గ‌డ‌పాటి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతుండ‌గా.. టీఆర్ఎస్ నేతలు ఆయ‌న పై ఈసీకి ఫిర్యాదు చేశారు. లగడపాటి కాంగ్రెస్‌ నేత అయినందునే పథకం ప్రకారం ఎన్నికల ఫలితాలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజలను సర్వేల పేరిట ఎన్ని కుయుక్తులు పన్నినా తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని టిఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top