అందుకే ఆరోజు చంద్రబాబు కి మద్దతు ఇచ్చాను అని చెప్పిన పవన్..!

అందుకే ఆరోజు చంద్రబాబు కి మద్దతు ఇచ్చాను అని చెప్పిన పవన్..!

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గుంటూరు జిల్లాకు చెందిన నాయకుడు రావెల కిషోర్ బాబు ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో విజయవాడ ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయాలలో కుల వ్యవస్థ పిచ్చి మీరు పోతుందని...ఒక్కొక్క పార్టీ ఒక్కో కులాన్ని పెంచి పోషిస్తోందని..ఇలానే ముందుకు వెళితే భవిష్యత్ తరాలు ఇబ్బంది పడతారని పేర్కొన్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఇలానే కుల వ్యవస్థ పెంచి రాజకీయ నాయకులు పబ్బం గడుపుతున్నారని...కానీ ప్రజల మధ్య అశాంతి తారా స్థాయిలో ఉందని...ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలని ఆ నాడు 2014 ఎన్నికల్లో చంద్రబాబు కి మద్దతిచ్చానని తెలియజేశారు పవన్. అవినీతి రహిత పాలన వస్తోందని చంద్రబాబునాయుడు అందిస్తారని భావించానని చెప్పారు.కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబునాయుడు మాత్రం పాలనలో ఆ తరహ చేయలేదన్నారు.రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తిందన్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడుతారనే ఎన్టీఆర్, చంద్రబాబునాయుడుకు గతంలో పేరుండేదన్నారు.ఈ దఫా చంద్రబాబునాయుడు పాలన మాత్రం అందుకు విరుద్దంగా ఉందన్నారు. ప్రజలకు సేవ చేసే రాజకీయ వ్యవస్థ అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కుల రాజకీయాలు వస్తే భవిష్యత్ తరానికి ఇబ్బందులని పవన్ కళ్యాణ్ చెప్పారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top