హైదరాబాద్ మెట్రో గురించి మరో శుభవార్త చెప్పిన కేటీఆర్..!

హైదరాబాద్ మెట్రో గురించి మరో శుభవార్త చెప్పిన కేటీఆర్..!

ఒకపక్క ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్ళిపోతున్న ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ మరోపక్క తెలంగాణ అభివృద్ధిలో భాగమైన మెట్రో గురించి మాదాపూర్ లో జరిగిన ఓ సమావేశంలో శుభవార్త తెలియజేశారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను పొడిగిస్తామని మంత్రి కెటిఆర్‌ అన్నారు. మాదాపూర్‌లో జరిగిన స్పిరిట్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
 
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు హైదరాబాద్‌ అన్ని రంగాలకు అనుకులమైన నగరమన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలతో హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీగా మారిందని తెలిపారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయంలో 43 శాతం సంక్షేమానికి వినియోగిస్తున్నామని తెలిపారు. ఆర్థికవృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ ముందుందని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
 
భవిష్యత్తులో టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నగరంలో అద్భుతమైన ప్రపంచాన్నే నివ్వెరపరిచే కార్యక్రమాలను నిర్వహిస్తుందని..గత ప్రభుత్వాల కంటే టీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నగరం కొత్త రూపు దాల్చుకుంటుందని ఈ సమావేశంలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కేటీఆర్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top