జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ..!

By Xappie Desk, December 03, 2018 11:01 IST

జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ..!

ఎన్నికల ముందు జనసేన పార్టీకి ఊహించని దెబ్బ తగిలింది. 2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ కి మద్దతు తెలిపిన జనసేన తరువాత చంద్రబాబు ప్రభుత్వం తీవ్రంగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపద్యంలో ఈ సంవత్సరం మార్చి నెలలో తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చి 2019 ఎన్నికలలో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్. ఈ క్రమంలో తన పార్టీ తరఫున రాష్ట్ర పర్యటనకు ప్రజా పోరాట యాత్ర ద్వారా సిద్ధమైన సంగతి మనకందరికీ తెలిసిందే. ఇప్పటికే అనేక చోట్ల పవన్ కళ్యాణ్ యాత్ర చేపట్టారు.
 
ఈ క్రమంలో మరి కొద్ది నెలల్లో ఎన్నికలు దగ్గరకు వస్తున్న క్రమంలో జనసేన పార్టీకి షాక్ తగిలింది. కీలక నేత ఒకరు పార్టీ కి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ , కాంగ్రెస్ పార్టీ నేతలు.. తమ పార్టీలకు రాజీనామా లు చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
 
కాగా.. తాజాగా జనసేన కి కూడా ఓ సీనియర్ నేత రాజీనామా చేశారు. జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విజయబాబు రాజీనామా చేశారు. జనసేనలో కీలకంగా వ్యవహరించిన విజయ్‌బాబు ఆపార్టీకి రాజీనామా చేయడం పట్ల పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా... వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు విజయ్‌బాబు వెల్లడించారు.
 
ఇదిలా ఉండగా విజయ్‌బాబు గతంలో ఆర్టీఐ కమిషనర్ గా పనిచేశారు. మొత్తంమీద ఎన్నికల ముందు జనసేన పార్టీలో ఈ విధమైన పరిస్థితి రావడంతో ప్రత్యర్థులు జనసేన పార్టీ మరో ప్రజారాజ్యం పార్టీ అవుతుందని కామెంట్ చేస్తున్నారు. ఈ విధంగానే పార్టీని పవన్ కళ్యాణ్ నడిపిస్తే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీకి కోలుకోలేని దెబ్బ తగులుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top