అనంతపురం కవాతు కార్యక్రమానికి వెళ్లిన జనసేన కార్యకర్తలు నలుగురు దుర్మరణం..!

అనంతపురం కవాతు కార్యక్రమానికి వెళ్లిన జనసేన కార్యకర్తలు నలుగురు దుర్మరణం..!

ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాయలసీమ ప్రాంతం అనంతపురం జిల్లాలో తన పార్టీ తరఫున కవాతు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు భారీగా తరలిరావడంతో..
ఘోర రోడ్డు ప్రమాదం .సంభవించింది. కర్నూలుకు చెందిన నలుగురు కార్యకర్తలు అనంతపురం కవాతుకు వెళ్లారు. కవాతులో పాల్గొని మరికొద్ది సేపట్లో ఇంటికి చేరుకోబోతారు అనుకుంటుండగా ఓ ప్రవేట్ బస్సు వారి పాలిట మృత్యువుగా మారింది.
 
డోన్ సమీపంలో వచ్చేసరికి జనసేన కార్యకర్తలు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారులో ఉన్న నలుగురుకార్యకర్తలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు వెల్దుర్తి మండలం గోవర్థనగిరికి చెందిన హనుమన్న, గోవింద్, డోన్ మండలం ధర్మవరానికి చెందిన మధుగా గుర్తించారు. మరోక మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
 
అయితే డ్రైవర్ మల్లికార్జుజనరావు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. ఇదే క్రమంలో ప్రమాద ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడ ఉన్న అధికారుల ద్వారా తెలుసుకున్నారు పవన్. మరోపక్క అక్కడ మిగతా కార్యక్రమాలను స్థానిక జనసేన పార్టీ కి సంబంధించిన నాయకులను చూసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు సమాచారం.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top