ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు: అసదుద్దీన్ ఓవైసీ

By Xappie Desk, December 03, 2018 11:27 IST

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు: అసదుద్దీన్ ఓవైసీ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ జాతీయ మీడియా ఛానల్ లో సంచలనకరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో మరికొద్ది రోజులలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాలలో ను మరియు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. రాబోయే లోక్సభ ఎన్నికలలో జాతీయ పార్టీలు అయిన బీజేపీ మరియు కాంగ్రెస్ పార్టీలకు 240 స్థానాలు రావడం కష్టమని పేర్కొన్నారు.
 
రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు కనీస స్థానాలు కూడా రావని అన్నారు. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం గురించి మాట్లాడుతూ..అక్కడ పోటీ అంతా టీడీపీ, వైసీపీ మధ్యే ఉంటుందని సరైన వ్యూహాంతో వైసీపీ అధినేత జగన్ ముందుకు వెళితే ఆయనను ఎదుర్కోవడం కష్టమని ఒవైసీ సూచించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ లో జగన్ బలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు.
 
మరోవైపు ఎంఐఎంకు టీఆర్ఎస్ బీఫ్ బిర్యానీ వడ్డిస్తుందన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలపై అసదుద్దీన్ మండిపడ్డారు. మీ సిద్ధాంతాల ప్రకారం మీకు బిర్యానీ అంటే ఇష్టం ఉండకపోవచ్చు.. కానీ తన వ్యక్తిగత ఆహార అలవాట్లను ప్రశ్నించే హక్కు బీజేపీకి లేదన్నారు. బీజేపీకి ఎంఐఎం, టీఆర్ఎస్ పార్టీలు బీ టీమ్‌గా వ్యవహరిస్తున్నాయన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపైనా ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top