త్వరలో ఆంధ్రాలో కూడా అడుగుపెట్టబోతున్నాం: కేటీఆర్

త్వరలో ఆంధ్రాలో కూడా అడుగుపెట్టబోతున్నాం: కేటీఆర్

మరి కొద్ది రోజులలో ఎన్నికలు జరగనున్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీల రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారానికి స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేటీఆర్ ఇటీవల ప్రచారంలో పాల్గొని త్వరలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా అడుగు పెట్టబోతున్నట్లు కామెంట్లు చేశారు.
 
రాబోయేరోజుల్లో రాజకీయంగా చంద్రబాబు అంతుచూస్తామని..అవసరమైతే ఆంధ్రా రాజకీయాల్లో కూడా వేలుపెట్టేందుకు వెనకాడమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఇప్పటికే అమరావతి దాకా తరిమికొట్టిన చంద్రబాబుకు..సరైన సమయంలో సీఎం కేసీఆర్‌ తగిన బుద్ది చెబుతారని స్పష్టం చేశారు. శనివారం నగరంలోని భరత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మన నగరం కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ పుట్టలో వేలు పెడితే ఏ చీమైనా కుడుతుందని .. అలాంటిది తెలంగాణలో వేలు పెట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించారు.
 
ఇటీవల పేపర్‌ ప్రకట నలు చూస్తున్నాం.ఆప్రకటనలకు ఎవరు డబ్బు పెడుతున్నారో అందరికీ తెలుసు.రాహుల్‌గాంధీ సీట్లు పంచొచ్చు..చంద్రబాబు కోట్లు పంచొచ్చు,, ఓట్లు వేసిది మాత్రం మనం. కాబట్టి రాబోయే ఎన్నికలలో మహాకూటమికి దిమ్మతిరిగిపోయే విధంగా మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు కేటీఆర్. చంద్రబాబు రాహుల్ గాంధీ ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరని..పేర్కొన్నారు కేటీఆర్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top