త్వరలోనే జాతీయస్థాయిలో రాజకీయాలు అంటున్న కేసీఆర్..!

త్వరలోనే జాతీయస్థాయిలో రాజకీయాలు అంటున్న కేసీఆర్..!

జాతీయస్థాయిలో కాంగ్రెస్ బిజెపి పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొత్త ఫ్రంట్ కోసం పోరాడుతున్నానని అన్నారు కెసిఆర్. జాతీయ పార్టీలైన కాంగ్రెస్- బిజెపి పార్టీలు ఉన్న కూటమిలో టిఆర్ఎస్ పార్టీ ఉండదని తేల్చేశారు. అంతేకాకుండా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై తాను టీఎంసీ అధినేత మమతా బెనర్జీ, జేడీఎస్ సీనియర్ నేత దేవెగౌడ, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో తాను మాట్లాడానని వెల్లడించారు. వీరంతా తన ఆలోచనతో ఏకీభవించారని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడారు.
 
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మరోసారి టిఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో స్ట్రాంగ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుందని కేసీఆర్ ధీమాగా పేర్కొన్నారు. ఎన్నికలు అయిపోయాక టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం దేశమంతా పర్యటిస్తానని తెలిపారు. తాను పోరాడయోధుడిననీ, ముష్టివాడిని కాదని వ్యాఖ్యానించారు. తాను పోరాడటంతోనే అసాధ్యం అనుకున్న తెలంగాణ సుసాధ్యం అయిందనీ, అలాగే ఫెడరల్ ఫ్రంట్ సైతం ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే ఈ రెండు పార్టీలు ఉండకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కెసిఆర్.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top