ప్రపంచ పటంలో హైదరాబాద్ కి అంత గుర్తింపు రావడానికి కారణం నేనే : చంద్రబాబు

ప్రపంచ పటంలో హైదరాబాద్ కి  అంత గుర్తింపు రావడానికి కారణం నేనే : చంద్రబాబు

ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు కూకట్‌పల్లి నియోజకవర్గం టిడిపి క్యాండెట్ నందమూరి సుహాసిని తరపున నియోజకవర్గంలో ప్రచారం చేశారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత నాలుగు సంవత్సరాల కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రగతిభవన్‌, ఫామ్‌హౌజ్‌కే పరిమితమయ్యారని కామెంట్ చేశారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గొడవలు సృష్టించిన మోడీతో కెసిఆర్ చేతులు కలపడం దారుణమని ఆరోపించారు.
 
ఇటువంటి కేసిఆర్ ని రానున్న ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ క్రమంలో హైదరాబాద్ గురించి మాట్లాడుతూ ప్రపంచ పటంలో హైదరాబాద్ కి అంత పేరు రావడానికి గల కారణం నేనే అంటూ చంద్రబాబు అన్నారు. హైదరా బాద్‌ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ఘనత టిడిపిదేనన్నారు.
 
ప్రధానంగా హైటెక్‌ సిటీ నిర్మాణంతో ప్రపంచ స్థాయిలో హైదరాబాద్‌కి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చామన్నారు. టిడిపి అధినేత చంద్రాబునాయుడు స్పష్టం చేశారు. తెలంగాణలో కెసిగర్‌ చేపట్టిన అభిృద్ధి విషయంలో తాను ఎప్పుడైనా అడ్డుకున్నానా అని ప్రశ్నించారు. అభివృద్ధికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని, ప్రజల సమస్యల విషయంలో ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నట్లు తెలిపారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top