అందుకే మా అన్న చిరంజీవి ని వదిలేసా...అనంతపురం సభలో పవన్ నిప్పులు..!

అందుకే మా అన్న చిరంజీవి ని వదిలేసా...అనంతపురం సభలో పవన్ నిప్పులు..!

అనంతపురం జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో జరిగిన భారీ బహిరంగ సభలో సంచలన కరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఈ సభలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులపై చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై విమర్శల వర్షం కురిపించారు. ముఖ్యంగా నియోజకవర్గంలో జెసి చేస్తున్న రౌడీయిజం పై ప‌వన్ నిప్పులు చెరిగారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యడం జేసీకి తగదని.. ఇకనైన‌ జేసీ ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని ప‌వ‌న్ మండిప‌డ్డారు. అన్నారు.
 
ఇక త‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి పై ఆశ‌క్తి లేద‌ని, అంత‌క‌న్నా ముఖ్యంగా కుటుంబ వ్యామోహం లేద‌ని, అందుకే త‌న అన్న చిరంజీవిని ఎప్పుడో వ‌దిలేశాన‌ని ప‌వ‌న్ అన్నారు. ఇక ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు బ‌ల‌వంత‌పు భూసేక‌ర‌ణ చేయించార‌ని, బాబు పాల‌న అంతా అవినీతిమ‌యం అయ్యింద‌ని, ఒక్కో నియోజ‌కవ‌ర్గంలో టీడీపీ నేత‌లు 3500 కోట్లు పైనే దోపిడీ చేశార‌ని ప‌వ‌న్ విరుచుకుప‌డ్డారు.
 
మరియు అదే విధంగా వీటివల్ల చంద్రబాబు అండ్ కో బిజెపి పార్టీ తో పవన్ కళ్యాణ్ చేతులు కలిపారని చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు పవన్. నేనేమీ అవినీతి కేసుల్లో చిక్కుకోలేదని దమ్ముంటే ఆయన నా పై కేసులు పెట్టాలని దేనికి నేను మోడీకి భయపడతారని చంద్రబాబు అంటున్నారని ప్రశ్నించారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top