భార్య ఉండగానే వేరొక అమ్మాయి కి కడుపు చేసిన వాడు పవన్ అంటూ జగన్ విమర్శలు..!

By Xappie Desk, December 04, 2018 10:53 IST

భార్య ఉండగానే వేరొక అమ్మాయి కి కడుపు చేసిన వాడు పవన్ అంటూ జగన్ విమర్శలు..!

గత కొంతకాలంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దారుణంగా ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ కులం గురించి మరియు మగతనం గురించి మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు చేస్తూ దారుణంగా విమర్శించిన నేపద్యంలో ఇటీవల జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రలో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావిస్తూ దారుణమైన కౌంటర్లు వేశారు. ముఖ్యంగా రాజకీయాలలో విలువలు విశ్వసనీయత మరియు దేశం యొక్క గొప్పతనం గురించి ప్రజల ముందు మాట్లాడుతూ పైన పటారం లోన లొటారం అన్నట్టుగా నటిస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ కి తనదైన శైలిలో జగన్ కౌంటర్లు వేసారు.
 
భారతదేశంలోనే అతి గొప్ప వ్యవస్థ పెళ్లి వ్యవస్థని...అటువంటి పెళ్లి వ్యవస్థని రోడ్డుమీద కి తీసుకొచ్చిన ఘనుడు ఈ పవన్ కళ్యాణ్ అని..కొత్త కారు మార్చినట్లు పెళ్లాలను మారుస్తూ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు అని గతంలో చేసిన వ్యాఖ్యలు చేశారు జగన్. అంతేకాకుండా తన రెండో భార్య రేణు దేశాయ్ ఉండగానే మరొక అమ్మాయి కడుపు చేశాడని.. జగన్ పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు. ఇదే విషయాన్ని సదరు అమ్మాయి రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ రెండో భార్య ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో తెలియజేస్తే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కార్యకర్తలు సదరు స్త్రీ అని చూడకుండా సోషల్ మీడియాలో దారుణంగా విమర్శలు చేశారు.
 
ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సదరు స్త్రీ పై సోషల్ మీడియాలో దాడి చేస్తున్న ఏ మాత్రం నోరు మెదపలేదని పేర్కొన్నారు. ఈయనగారి తప్పులను ఎత్తి చూపితే అవతల వ్యక్తి ఇంట్లో వారి ఆడవాళ్లపై సోషల్ మీడియాలో దారుణంగా తన కార్యకర్తల చేత తిట్టిస్తాడని..దీన్ని మగతనం అంటారా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు జగన్. తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియాలో గతంలో పవన్ కళ్యాణ్ కి వచ్చిన మద్దతు ప్రస్తుతం రాలేదు. జగన్ చేసిన కామెంట్లలో నిజం ఉంది కాబట్టి ఈ సమయంలో జగన్ ని సోషల్ మీడియాలో జనసేన పార్టీ కార్యకర్తలు విమర్శిస్తే అది పూర్తి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి జనసేన పార్టీకి డామేజ్ తీసుకు రావడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.Top