ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ టిఆర్ఎస్ రావాలి అని తేల్చేసిన నల్లగొండ సభలో కేసీఆర్..!

By Xappie Desk, December 04, 2018 10:56 IST

ఇదే అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ టిఆర్ఎస్ రావాలి అని తేల్చేసిన నల్లగొండ సభలో కేసీఆర్..!

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్. పర్యటనలో భాగంగా ఇటీవల నల్గొండ జిల్లాలో పర్యటించిన కేసీఆర్ ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఈసారి ఎన్నికలలో నల్గొండ జిల్లా నుండి పోటీ చేద్దాం అని అనుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు అని పేర్కొన్నారు. అంతేకాకుండా జిల్లాలో జరిగిన అభివృద్ధి గురించి మరియు విపక్ష పార్టీలు చేస్తున్న విమర్శల గురించి ప్రజలకు తనదైన శైలిలో క్లారిటీ ఇస్తూ వివరించారు కేసీఆర్. ఈ రోజు పాలమూరు ఎత్తిపోతల అద్భుతంగా జరుగుతోందని, దీంతో ఆ జిల్లా పచ్చబడిందన్నారు, దీనివల్లనే వలసలు కూడా ఆగిపోయాయని చెప్పారు. మళ్లీ ఈసారి ఎన్నికల్లో కూడా నల్గొండ నుంచి పోటీచేయాలనే ప్రతిపాదన వచ్చిందని, కానీ అందుకు గజ్వేల్‌ ప్రజలు అంగీకరించకపోవడంతో తన స్థానంలో భూపాల్‌ రెడ్డిని నల్గొండ నుంచి బరిలో దించినట్టు చెప్పారు కేసీఆర్.
 
నల్గొండలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. గత పార్టీలపాలనలో విద్యుత్ కష్టాలు ఉండేవని, కానీ తెరాస అధికారం లోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 24గంటల పాటు ప్రజలకు విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. ఇదే క్రమంలో ఇటీవల తెలంగాణ ప్రాంతంలో పర్యటించిన మోడీ చేసిన విమర్శలకు కేసీఆర్ తనదైన శైలిలో కౌంటర్లు వేశారు. తెలంగాణా రాష్ట్రంలో విద్యుత్తు సరిగా ఉండడం లేదంటూ ప్రధాని మోదీ విమర్శలు చేయడంసారి కాదని చెప్పారు. గతంలో మైనార్టీల గురించి ఎవరూ పట్టించుకోలేదని, తెరాస వారి సంక్షేమానికి రూ. 2వేల కోట్ల బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని చెప్పారు. మైనార్టీల విద్య కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలను ఏర్పాటు చేసినట్టు కేసీఆర్‌ వివరించారు. అలాగే గతంలో నల్లగొండ జిల్లాలో ఉన్న గుండాల రౌడీల వాతావరణం ప్రస్తుతం లేదని..టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు. ఇదే అభివృద్ధి కొనసాగాలని అంటే రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని మరొకసారి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు కేసీఆర్.Top