రేవంత్ రెడ్డి భార్య కి ఫోన్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్..!

By Xappie Desk, December 04, 2018 10:59 IST

రేవంత్ రెడ్డి భార్య కి ఫోన్ చేసిన కాంగ్రెస్ హైకమాండ్..!

తాజాగా కొడంగల్ నియోజకవర్గం లో కెసిఆర్ సభ జరగబోతున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండాలని పోలీసులు కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డిని అరెస్టు చేశారు. కెసిఆర్ సభ కొడంగల్ లో జరగనున్న క్రమంలో అప్పట్లో కెసిఆర్ సభను అడ్డుకోవాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు కొడంగల్ లో ఎటువంటి ఘటనలు జరగకుండా ఈరోజు తెల్లవారుజామున పోలీసులు రేవంత్ రెడ్డి ఇంటిలోకి ప్రవేశించి అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి తో పాటు మరికొంతమంది అనుచరులను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసి జడ్చర్ల పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలించినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ ఎలాంటి స్పష్టతా రావడం లేదు. మరోవైపు తన భర్తను అర్థరాత్రి ఉగ్రవాదిలా ఈడ్చుకెళ్లారని రేవంత్ రెడ్డి భార్య గీత ఆరోపించారు. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదని వాపోయారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాగా, ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ గీతకు ఫోన్ చేశారు. రేవంత్ రెడ్డి అరెస్ట్, తదనంతర పరిణామాలపై చర్చించారు. ధైర్యంగా ఉండాలనీ, కాంగ్రెస్ పార్టీ రేవంత్ కు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అరెస్టుతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.Top