కలిసి రాష్ట్రాలను అభివృద్ధి పరుద్దాం అంటే కెసిఆర్ రాలేదు..!

కలిసి రాష్ట్రాలను అభివృద్ధి పరుద్దాం అంటే కెసిఆర్ రాలేదు..!

టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తన ట్విట్టర్ అకౌంట్ లో సంచలనకరమైన కామెంట్లు చేశారు. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి ప్రస్తావిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల ను అన్యాయం చేసిన మోడీ తో కేసీఆర్ కలసి లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఇదే విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు చంద్రబాబు. ఈ క్రమంలో కేంద్ర పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల ను మోసం చేస్తున్న క్రమంలో అప్పట్లో కేసీఆర్ తో కలిసి పనిచేద్దామని ఆయనను సంప్రదిస్తే కలవలేదని పేర్కొన్నారు. అన్ని వనరులున్నా సమర్థమైన నాయకత్వం లేకనే తెలంగాణ నేడు సమస్యలను ఎదుర్కొంటోందని.. టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజాకూటమికి మద్ధతు ఇచ్చానని చంద్రబాబు అన్నారు. ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు త్యాగాలు చేస్తూ పల్లకీలు మోస్తున్నారంటే కారణం కేవలం ప్రజలేనని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. పదవులు ఆశించకుండా ప్రజలకు మేలు జరగాలని టీడీపీ కార్యకర్తలు శ్రమిస్తున్నారని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి జరగాలంటే రానున్న ఎన్నికల్లో మహాకూటమి ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు.Top