జగన్ సభలకు కరెంట్ లేకుండా చేస్తున్న అధికార పార్టీ..!

By Xappie Desk, December 04, 2018 11:56 IST

జగన్ సభలకు కరెంట్ లేకుండా చేస్తున్న అధికార పార్టీ..!

ప్రజా సంకల్ప పాదయాత్ర తో ఆంధ్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన జగన్ అధికార పార్టీ కు మరియు రాష్ట్రంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీల నేతలకు నిద్ర లేకుండా చేస్తూ దూసుకెళ్ళిపోతున్న క్రమంలో జగన్ సభలకు ప్రజల నుండి అనూహ్యమైన స్పందన వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీ తెలుగుదేశం అధికార దుర్వినియోగం చేస్తూ జగన్ సభలకు కరెంట్ లేకుండా చేస్తున్న క్రమంలో ప్రజలు చంద్రబాబు ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా రాజం వద్ద సోమవారం నాడు సభ జరిగింది. అదే సమయంలో రాజాం పట్టణంతోపాటు నియోజకవర్గంలోని పలు మండలాలకు విద్యుత్‌ సరఫరాను నిలుపుదల చేయించింది. గంటన్నర పాటు విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. బహిరంగ సభ పూర్తయ్యాక తిరిగి సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయమై రాజాం ఎలక్ట్రికల్‌ ఏడీ బీవీ రమణను అడిగితే సాంకేతిక కారణాల వల్ల కొన్ని చోట్ల సరఫరా ఆగి ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యం అంటూ ఈ మద్య ఊదర కొడుతున్న చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న నిర్వాకం ఇదన్నమాట అని చాలామంది రాజకీయ నేతలు టిడిపి ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. మరోవైపు శ్రీకాకుళం ప్రజలు రాజకీయంగా జగన్ ను ఎదుర్కోలేకే ఇటువంటివి చేస్తున్నారని అంటున్నారు.Top