జగన్ హత్యాయత్నం కేసు విషయమై బాబు కి షాక్ ఇచ్చిన హైకోర్టు..!

By Xappie Desk, December 04, 2018 11:57 IST

జగన్ హత్యాయత్నం కేసు విషయమై బాబు కి షాక్ ఇచ్చిన హైకోర్టు..!

అక్టోబర్ 25 వ తారీఖున విశాఖపట్టణం విమానాశ్రయంలో ఏపీ ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ పై జరిగిన హత్యా యత్నం కేసు ఇటీవల హైకోర్టు దృష్టికి వచ్చింది. ఈ నేపద్యంలో హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర పరిధి ప్రాంతంలో దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విచారణ చేస్తుందని చంద్రబాబు ప్రభుత్వం పై ప్రశ్నల వర్షం కురిపించింది. అసలు ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ విచారణ చేపట్టాలని ఎందుకు వారికి అప్పగించ లేదని హైకోర్టు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
&nbsp:
అంతేకాకుండా కేసును ఎన్ఐఎకు ఎందుకు బదిలీ చేయలేదో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఎపి ప్రభుత్వాన్ని ఆదేశించింది. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసును ఏపీ పోలీసుల పరిధి నుంచి ఎన్ఐఏకు బదిలీ చేసేలా ఆదేశించాలని కోరుతూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు సోమవారం వాదనలు విన్నది. ఆయన తరపున న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌ రెడ్డి వాదనలు వినిపించారు. సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసి కావాలనే ఏపీ ప్రభుత్వం విచారణను తమ పరిధిలో సాగిస్తుందని కోర్టుకు తెలిపారు. దీంతో హైకోర్టు మళ్లీ ఈ కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది.Top