టిడిపి నాయకులు చంపడానికి ప్లాన్ చేస్తున్నారు: విజయసాయిరెడ్డి..!

By Xappie Desk, December 05, 2018 11:23 IST

టిడిపి నాయకులు చంపడానికి ప్లాన్ చేస్తున్నారు: విజయసాయిరెడ్డి..!

గత అక్టోబర్ నెలలో వైసిపి నేత ప్రతిపక్ష నేత జగన్ పై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన హత్యా యత్నం రెండు తెలుగు రాష్ట్రాలలో కలకలం సృష్టించింది. ఇప్పటికీ కేసు గురించి హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది. ఈ క్రమంలో అప్పట్లో జగన్ మీద జరిగిన హత్యా యత్నం ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన కుట్ర అని చాలామంది వైసీపీ నేతలు కామెంట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి చేసిన కామెంట్ ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన విజయసాయిరెడ్డి తెలంగాణ ఎన్నికల విషయంలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఏపీలో అవినీతి చేసి దోచుకున్న సొమ్ముతో తెలంగాణ రాష్ట్రంలో ఓట్లను కొనుగోలు చేయడానికి డబ్బులు పంచడానికి రెడీ అయినట్లు విజయసాయి రెడ్డి ఆరోపించారు.
 
అంతేకాకుండా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ జగన్ మీదనే ఇప్పటి వరకు తెలుగుదేశం నేతలు చంపాలని ప్లాన్ చేసుకున్నారని అనుకున్నామని,కానీ ఇప్పుడు వారు నన్ను కూడా హతమార్చాలని ప్రయత్నిస్తున్నట్టు తనకి విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న వార్త అని విజయసాయి రెడ్డి సంచలనం సృష్టించారు.అయితే తన మీద దాడి ఆక్సిడెంట్ రూపంలో గాని వేరే ఇతర రూపాలలో కానీ జరిగే అవకాశాలు ఉండొచ్చని తనకి సమాచారం వచ్చిందని అన్నారు. ఈ తతంగం మొత్తం తెలుగుదేశం పార్టీ పెద్దల కనుసన్నల్లో జరుగుతుందని జగన్ ని హతమార్చాలని ఎలా ప్లాన్ చేస్తున్నారోఅదేవిధంగా తనను హతమార్చడానికి టిడిపి నాయకులు స్కెచ్చు వేస్తున్నారని ఆరోపించారు విజయసాయిరెడ్డి.Top