చాలా నిరుత్సాహంలో కూరుకుపోయిన కూకట్‌పల్లి టిడిపి క్యాడర్..!

By Xappie Desk, December 05, 2018 11:27 IST

చాలా నిరుత్సాహంలో కూరుకుపోయిన కూకట్‌పల్లి టిడిపి క్యాడర్..!

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు మరియు కార్యకర్తలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కారణం ఏమిటంటే కూకట్‌పల్లి నియోజకవర్గంలో మహా కూటమి పార్టీ లో భాగమైన టిడిపి పార్టీ క్యాండెట్ దివంగత నందమూరి హరికృష్ణ తనయురాలు నందమూరి సుహాసిని పోటీ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసినదే. నందమూరి సుహాసిని తరపున నియోజకవర్గంలో ఇప్పటికే నందమూరి వంశానికి చెందిన వారు బాలకృష్ణ...మరియు బంధువులు, చంద్రబాబు నియోజకవర్గంలో పర్యటించి సుహాసిని కి మద్దతు తెలిపారు.
 
ఈ క్రమంలో నందమూరి హాసినికి నియోజకవర్గంలో మద్దతు తెలపడానికి నందమూరి బ్రదర్స్ అయిన కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ వస్తారని అందరూ భావించారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చివరి రోజు మరియు కొద్ది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇప్పటికీ కూడా కళ్యాణ్ రామ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడంతో కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ మరియు కార్యకర్తలు నిరుత్సాహంలో కూరుకుపోయినట్లు సమాచారం.
 
మరోపక్క అన్నదమ్ములిద్దరూ కేవలం సినిమాల పైనే దృష్టి ఉంచినట్లు ప్రస్తుత పరిస్థితుల బట్టి రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇండస్ట్రీ లో వినపడుతున్న టాక్. ఇదిలా ఉండగా నందమూరి సుహాసిని గెలుపు కోసం కాంగ్రెస్ జాతీయ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా నియోజకవర్గంలో పర్యటించిన క్రమంలో జూనియర్ మరియు కళ్యాణ్ రామ్ లు రాకపోవడంతో కూకట్‌పల్లి నియోజకవర్గం టీడీపీ నేతలు చాలా నిరుత్సాహం చెందినట్లు సమాచారం .Top