కెసిఆర్ కేటీఆర్ లపై అదిరిపోయే సెటైర్ వేసిన నారా లోకేష్..!

By Xappie Desk, December 05, 2018 11:29 IST

కెసిఆర్ కేటీఆర్ లపై అదిరిపోయే సెటైర్ వేసిన నారా లోకేష్..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయమై ఏపీ మంత్రి టిడిపి నాయకుడు నారా లోకేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న రెండో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా కూటమి కచ్చితంగా గెలుస్తుంది అని..ఎక్కువ విజయవకాశాలు ప్రజా కూటమికే ఉన్నాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా గతంలో ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చాకే ఓటు అడుగుతానని ప్రకటించిన కేసీఆర్ మాట... ఇప్పుడు ఏమైందని సెటైర్లు వేశారు. కేవలం తన తండ్రి చంద్రబాబు చేసిన అభివృద్ధి తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అభివృద్ధి ఏమీ లేదని కామెంట్లు చేశారు లోకేష్. ఆంధ్రాలో కూడా వేలుపెడతానని మంత్రి కేటీఆర్ అన్న వ్యాఖ్యలపై లోకేష్ స్పందించారు.
 
కేటీఆర్ ఆంధ్రాకు వస్తావా రా అంటూ ఆహ్వానం పలికారు. ఆంధ్రాలో నిర్భయంగా ప్రచారం చేసుకోమన్నారు. ఏపీలో ప్రశాంత వారణం ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా చంద్రబాబు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ ఖండించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ని చంద్రబాబు ఎప్పుడు ఎక్కడ అడ్డుకున్నారని ప్రశ్నించారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రం అని అలాగే టిఆర్ఎస్ పార్టీ ధనిక పార్టీ అంటూ సెటైర్ వేశారు నారా లోకేష్.Top