పవన్ ప్రభంజనంతో - చీలుతున్న రాయలసీమ ఓటుబ్యాంకు - వణుకుతోన్న జగన్

By Xappie Desk, December 05, 2018 12:01 IST

పవన్ ప్రభంజనంతో - చీలుతున్న రాయలసీమ ఓటుబ్యాంకు - వణుకుతోన్న జగన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ - వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ల మధ్యన మాటల యుద్ధం విపరీతంగా పెరిగిపోయింది. ఇద్దరి మధ్యనా రాకూడని డిస్కషన్ లు మొదలు అయ్యాయి. పర్సనల్ టార్గెట్ లూ .. మగతనం అంటూ అసభ్య మాటలు దొర్లుతున్నాయి. రాయాలసీమ లో పవన్ కళ్యాణ్ రీసెంట్ గా చేసిన కవాతు సందర్భంగా వచ్చిన రియాక్షన్ చూసి జగన్ మోహన్ రెడ్డి కి భయం పట్టుకుంది అంటున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ మీద జగన్ ఇష్టం వచ్చిన కామెంట్ లు చేస్తున్నాడు అనీ పర్సనల్ గా వెళుతున్నాడు.. అనీ రేణూ దేశాయ్ పేరు కూడా ప్రస్తావిస్తూ పవన్ ని టార్గెట్ చేసాడు జగన్ అనీ అంటున్నారు. పొలిటికల్ గా ఎన్నైనా ఉండచ్చు గానీ రేణూ దేశాయ్ పేరు ప్రస్తావించి మరీ మాట్లాడడం చేతకాని తనం అని సోషల్ మీడియా లో జగన్ మీద మండి పడుతున్నారు అందరూ. ప‌వ‌న్ ఒక పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు. చంద్ర‌బాబు చేసే విమ‌ర్శ‌ల‌నే ప‌వ‌న్ చేస్తున్నార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు - ప‌వ‌న్ మ‌ధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉంద‌న్నారు జగన్ మోహన్ రెడ్డి.ప‌వ‌న్ సినిమాల‌కు ఇంట‌ర్వెల్ ఎక్కువ‌..సినిమా త‌క్కువ అంటూ విమ‌ర్శించారు. చంద్ర‌బాబు పేమెంట్ ఇస్తే ప‌వ‌న్ కాల్షీట్ ఇస్తార‌ని ఆరోపించారు. నాలుగేళ్లు చంద్ర‌బాబు తో క‌లిసి ఉన్న ప‌వ‌న్ కు ఆయ‌న చేసిన అవినీతి ..అన్యాయం లో బాధ్య‌త లేదా అని నిల‌దీసా రు. ప‌వ‌న్ త‌న స‌భ‌ల్లో చంద్ర‌బాబు గురించి త‌క్కువ మాట్లాడి..త‌న గురించి ఎక్కువ విమ‌ర్శ‌లు చేస్తార‌ని చెప్పుకొచ్చారు. ఇవన్నీ ఓకే కానీ కావాలని రేణూ దేశాయ్ గురించీ పవన్ నాలుగు పెళ్ళిళ్ళ గురించీ మాట్లాడడం చూస్తుంటే జగన్ కి మతి చెడిపోయింది అని ఎక్కిరిస్తున్నారు కొందరు. పవన్ కళ్యాణ్ కవాతి సూపర్ సక్సెస్ కావడం - నేషనల్ మీడియా , లోకల్ మీడియా , ప్రజలు , ఓటర్లు , యువత అందరూ రాయలసీమ లో పవన్ సృష్టిస్తున్న ప్రభంజనం వైపు చూస్తూ ఉండడం తో పవన్ కళ్యాణ్ ని ఎలా అడ్డుకోవాలో తెలీక ఇలా రెచ్చిపోతున్నారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ యొక్క కవాతు ప్రభావం రాయలసీమ జిల్లాల్లో గట్టిగా ఉంది అనీ జగన్ యొక్క గ్రాఫ్ నీ ఓటు బ్యాంకు నీ పవన్ ఎఫ్ఫెక్ట్ చేస్తాడు అనీ అంటున్నారు. ముఖ్యంగా జగన్ కి బలంగా ఉన్న యువత ఓట్లని పవన్ చీలుస్తున్నాడు అని ఇప్పటికే విశ్లేషకులు చెబుతుండడం తో పవన్ కళ్యాణ్ ని ఎదిరించలేక ఇలా మాట్లాడుతున్నాడు జగన్ అనే మాటలు వినపడుతూ ఉన్నాయి.Top