ఇంకొద్ది గంటల్లో ఎన్నికలుండగా కెసిఆర్ పోటీ గురించి సంచలన విషయం బయటపెట్టిన లగడపాటి..!

ఇంకొద్ది గంటల్లో ఎన్నికలుండగా కెసిఆర్ పోటీ గురించి సంచలన విషయం బయటపెట్టిన లగడపాటి..!

తెలుగు రాష్ట్రాలలో ఆంధ్ర ఆక్టోపస్ గా పేరుగాంచిన లగడపాటి ఇప్పటికే తెలంగాణ ఎన్నికల విషయమై సర్వేలు అంటూ రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి టెన్షన్ పుట్టించారు. ఈ క్రమంలో మరి కొద్ది గంటలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్ నియోజకవర్గం గురించి అక్కడ గెలుపు గురించి లగడపాటి చేసిన కామెంట్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హీటెక్కించాయి. తెలంగాణ లో జరగబోతున్న రెండో అసెంబ్లీ ఎన్నికలలో గజ్వేల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఓడిపోతాడని లగడపాటి వ్యాఖ్యానించారు. ఇటీవల గజ్వేల్ నియోజకవర్గంలో ప్రవేశించిన క్రమంలో కారును చెక్ చేసిన పోలీసులు ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు.
 
పోలీసులు తన సర్వే గురించి అడిగారని, ఆ సమయంలో గజ్వేల్ పరిస్థితి ఎలా ఉందని అడుగగా, “ఇక్కడ కేసీఆర్ ఓడిపోతారని వారు అన్నారని చెప్పాడు, కేసీఆర్ గెలుస్తాడని లగడపాటి అనగా, కావాలంటే డిసెంబర్ 11న చుడండి అని పోలీసులు నమ్మకంగా చెప్పారని అన్నారు. గత రెండు రోజులపాటు మీడియా ముందుకు వచ్చి తన సర్వేలలోని సంచలన విషయాలు బయటపెడుతున్న లగడపాటి, ఈ ఎన్నికల్లో కూటమిదే విజయం అని మరోసారి తేల్చి చెప్పారు. కేసీఆర్ సిట్టింగులందరికి సీట్లు ఇవ్వటమే తెరాస కొంప ముంచిందని అన్నారు. మొత్తంమీద లగడపాటి చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. మరో పక్క టిఆర్ఎస్ పార్టీ నేతలు లగడపాటి మహాకూటమి ఏజెంట్ అని తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి సర్వేల పేరిట మాట్లాడుతున్నారని విమర్శించారు.Top