కొద్ది గంటల్లో ఎన్నికలు ఇటువంటి సమయంలో ఇండియా టుడే సర్వే సంచలన ఫలితాలు..!

By Xappie Desk, December 06, 2018 11:19 IST

కొద్ది గంటల్లో ఎన్నికలు ఇటువంటి సమయంలో ఇండియా టుడే సర్వే సంచలన ఫలితాలు..!

మరికొద్ది గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న క్రమంలో ఇండియా టుడే తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన సర్వేలో సంచలన ఫలితాలు వెలువడ్డాయి. ఈ సర్వేలో అధికార పార్టీ టిఆర్ఎస్ కి అత్యధిక సీట్లు వస్తాయని మళ్లీ సీఎం కేసీఆర్ అని ఫలితాలు రావడంతో టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుండి లగడపాటి సర్వే అంటూ టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితాలు వస్తున్న క్రమంలో తాజాగా దేశంలోనే పేరుగాంచిన ఈ సర్వే మరి కొద్ది గంటల్లో ఎన్నికలుండగా నిర్వహించిన సర్వేల టిఆర్ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యత రావడంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఊపిరిపీల్చుకున్నారు.
 
మరికొంతమంది టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు లగడపాటి చంద్రబాబు స్కెచ్ ప్రకారం పద్ధతి ప్రకారం బూటకపు సర్వేలు నిర్వహిస్తూ తెలంగాణ ప్రజానికాన్ని తప్పుదోవ పట్టించడానికి రెడీ అయ్యారని మండిపడుతున్నారు. ఇండియా టుడే 17 పార్లమెంట్‌ నియోజవర్గాల్లో టెలిఫొనిక్‌ ఇంటర్వ్యూ ద్వారా నిర్వహించిన సర్వే లో టీఆర్‌ఎస్‌కు గతం లో కన్నా ఎక్కువ మద్దతు పెరిగిందని తెలుస్తుంది. గత నెల కన్నా ఈ నెలలో 48 శాతం మద్దతు పెరిగిందని చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలో కూటమికి అనుకూలంగా ఉందని తెలిపింది. తప్పకుండ తెరాస మల్లి విజయకేతనం ఎగిరేస్తుందని తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు.. రైతు బంధు, రైతు భీమా, కల్యాణ లక్ష్మీలపై ప్రజల్లో ఆధారణ ఉందని, ఇది టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశమని పేర్కొంది. ఏది ఏమైనా మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో దేశంలోనే పేరుగాంచిన ఇండియాటుడే నిర్వహించిన సర్వేలో టిఆర్ఎస్ పార్టీకే మళ్లీ విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్న క్రమంలో..చాలా మంది టిఆర్ఎస్ నేతలు ఎంతగానో సంతోషిస్తున్నారు.Top