కెసిఆర్ అధికారంలోకి రావాలని నాలుకను కోసుకున్న ఆంధ్ర వ్యక్తి..!

By Xappie Desk, December 06, 2018 19:46 IST

కెసిఆర్ అధికారంలోకి రావాలని నాలుకను కోసుకున్న ఆంధ్ర వ్యక్తి..!

టిఆర్ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ మళ్లీ తెలంగాణకి ముఖ్యమంత్రి అవ్వాలని ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓ యువకుడు నాలుకను కోసి దేవుడి హుండీలో వేసాడు. దీంతో ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో పెద్ద సంచలనం అయ్యింది. ముఖ్యంగా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తి తెలంగాణ సీఎం కేసీఆర్ అవ్వాలని కోరుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. గతంలో విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కూడా మళ్లీ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని ఆంధ్ర ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రానికి పాదయాత్ర చేసిన విషయం అందరికీ తెలిసిందే.
 
ఈ క్రమంలో మళ్లీ ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యక్తి కేసీఆర్ అధికారం లోకి రావాలని తన నాలుకను కోసి దేవుడి మొక్కు తీర్చుకున్నాడు.స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటన బంజారాహిల్స్‌లోని బుధవారం ఓ ఆలయంలో చోటుచేసుకుంది.త‌న నాలుక‌ను కోసి ఉండీలో వేశాడు. దీంతో, తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ యువకుడిని అక్కడి వారు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ దారుణానికి పాల్పడ్డ యువకుడు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన మహేష్ గా గుర్తించారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop