ఎన్నికలకు కొద్ది గంటల ముందు గజ్వేల్ రిపోర్ట్ విడుదల చేసిన లగడపాటి..!

ఎన్నికలకు కొద్ది గంటల ముందు గజ్వేల్ రిపోర్ట్ విడుదల చేసిన లగడపాటి..!

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరగనున్న క్రమంలో లగడపాటి రాజగోపాల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పోటీ చేయబోతున్న గజ్వేల్ నియోజకవర్గం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేస్తున్న కెసిఆర్ వోడి పోతున్నారని తాను నిర్వహించిన సర్వేలో ఇదే తేలిందని స్పష్టం చేశారు లగడపాటి.
 
ఇటీవల తాను గజ్వేల్ నియోజకవర్గానికి వెళ్లినప్పుడు ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రాంత పోలీసులు తన కారును చెక్ చేశారని ఈ సందర్భంగా పోలీసులను ఈ నియోజకవర్గంలో ఎవరు వస్తారు అని ప్రశ్నించగా.."ఇక్కడ కేసీఆర్ ఓడిపోతారని వారు అన్నారని చెప్పాడు, కేసీఆర్ గెలుస్తాడని లగడపాటి అనగా, కావాలంటే డిసెంబర్ 11న చుడండి అని పోలీసులు నమ్మకంగా చెప్పారని అన్నారు.
 
గత రెండు రోజులపాటు మీడియా ముందుకు వచ్చి తన సర్వేలలోని సంచలన విషయాలు బయటపెడుతున్న లగడపాటి, ఈ ఎన్నికల్లో కూటమిదే విజయం అని మరోసారి తేల్చి చెప్పారు. కేసీఆర్ సిట్టింగులందరికి సీట్లు ఇవ్వటమే తెరాస కొంప ముంచిందని అన్నారు. పొత్తుకు సిద్ధం అన్న టీడీపీతో కలిసుంటే తెరాసకు లాభం చేకూరేది అని విశ్లేషించారు. దీంతో లగడపాటి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారాయి.Top