తెలంగాణ ఎలక్షన్ నేపద్యంలో జన సైనికులకు వీడియో విడుదల చేసిన పవన్..!

తెలంగాణ ఎలక్షన్ నేపద్యంలో జన సైనికులకు వీడియో విడుదల చేసిన పవన్..!

రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికలలో జనసేన పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని గతంలో ప్రకటించిన పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణలో ఎన్నికలు వచ్చేసరికి చేతులెత్తేశారు. ఈ క్రమంలో మరి కొద్ది గంటల్లో తెలంగాణ ప్రజలు తమ నాయకుడని ఎన్నుకోబోతున్న క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. ముఖ్యంగా ఈ ఎన్నికలలో సమయ పాలన వల్ల జనసేన పార్టీ పోటీ చేయడం లేదని ఈ వీడియోలో తెలిపారు పవన్.
 
వీడియో లో పవన్ మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, త్యాగాలను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిని తానని... అందుకే తనకు తెలంగాణ అంటే ఎనలేని గౌరవమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. సుమారు 1.49 నిమిషాల నిడివి గల వీడియోను పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
 
తెలంగాణను ఇచ్చామనే వారు.. తెలంగాణను తెచ్చామనే వారు... తెలంగాణను పెంచామనే వారు పోటీలో ఉన్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు.ఎక్కువ పారదర్శకతో తక్కువ అవినీతితో ప్రజా రంజక పాలన సాగించే వారేవరో లోతుగా విశ్లేషించి ఓటు వేయాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అంతేకాకుండా అనుకోని విధంగా తెలంగాణలో ముందుగానే ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో సరైన సమయం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించలేక పోయినట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.com



Top