అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే పెద్ద దెబ్బ కెసిఆర్ కి..!

By Xappie Desk, December 06, 2018 19:52 IST

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే పెద్ద దెబ్బ కెసిఆర్ కి..!

అసెంబ్లీని రద్దు చేసి తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కి సొంత పార్టీ నేతలు చాలా మంది ఎన్నికల ముందు షాక్ ఇచ్చారు. టిఆర్ఎస్ పార్టీలో నుండి చాలా మంది ఎన్నికలలో టికెట్ రాలేదని లేకపోతే సదరు నియోజకవర్గంలో పార్టీ తరఫున పోటీ చేయడానికి స్థానం కల్పించలేదని..ఇలా సొంత పార్టీ నేతలు కేసీఆర్ పై తమ అసహనాన్ని వ్యక్తం చేసి పార్టీ వీడి వెళ్లిపోయారు.
 
ఈ క్రమంలో వీళ్లంతా వెళ్లిపోయిన కానీ టిఆర్ఎస్ పార్టీ నుండి చేవెల్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీకి మరియు పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడంతో టిఆర్ఎస్ శ్రేణులు మరియు కేసీఆర్ ఊహించని షాక్ తిన్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలో అత్యున్నత వ్యక్తులలో ప్రముఖులలో ఒకరైన చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి..ముందు నుండి వెనుకబడిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తీసుకెళ్లాలని అభివృద్ధి పరచాలని బంగారు తెలంగాణ కా తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కలలు కంటూ అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున పార్లమెంటులో టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలలో ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం కోసం మరియు అభివృద్ధి కోసం జాతీయ పెద్దల మధ్య...పార్లమెంట్లో తెలంగాణ వాయిస్ వినిపించిన వ్యక్తిగా చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి కి జాతీయస్థాయిలో మంచి పేరుంది.
 
ఈ క్రమంలో తన స్వార్ధ రాజకీయాలకోసం రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత నెలకొంటున్న క్రమంలో ఎవరికి ఇన్ఫామ్ చేయకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్లిపోయిన కేసీఆర్ పట్ల ఆయన ఎన్నికలకు వెళ్లిన తీరు పట్ల చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అసహ్యించుకొని..టిఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చేసి పార్టీకి రాజీనామా చేసి పదవికి రాజీనామా చేసి తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించారు.
 
ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ముందు నుండి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పడాలని రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుందని తెలిసిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తెలంగాణ ప్రజలకు సంతోషాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వల్లే కచ్చితంగా అణగారిన తెలంగాణ బంగారు తెలంగాణ గా మారుతుందని భావించిన చేవెళ్ల ఎంపిక విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీకి మరియు అధ్యక్షుడు కేసీఆర్ కి ఇదే పెద్ద దెబ్బ అని..ఇప్పుడు కేవలం అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టిన కేసీఆర్ కి...రానున్న పార్లమెంటు ఎన్నికల్లో విశ్వేశ్వర్ రెడ్డి రూపంలో చాలా ఇబ్బందులు ఎదురు కావడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి తన స్వార్ధ రాజకీయాలకోసం అసెంబ్లీని రద్దు చేసిన కేసీఆర్ కి పార్లమెంటు ఎన్నికల్లో చుక్కలు చూపించడానికి రెడీ అయిపోయారు విశ్వేశ్వర్ రెడ్డి.
 
Journalists, who have passion for witting actuate news. If you want to write for Xappie as a full time or part-time. Please Mail us on content@xappie.comTop