తెలంగాణ సీఎం అభ్యర్థి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..!

By Xappie Desk, December 06, 2018 19:52 IST

తెలంగాణ సీఎం అభ్యర్థి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..!

తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి తరపున ముఖ్యమంత్రి పదవి అభ్యర్థుల్లో చాలా మంది సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు టెన్షన్ పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఏర్పడిన 'మహాకూటమి' తెలంగాణలో రెండోసారి జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవి కోసం చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఇటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ప్రకటన టీ టీ కాంగ్రెస్ నేతలకు మరియు తెలంగాణ ప్రజలకు ఆశ్చర్యానికి గురి చేసింది.
 
మహాకూటమి పక్షాల మధ్య మంచి స్నేహపూరిత వాతావరణం ఉంది. భవిష్యత్ లో కూడా ఇది కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓటమి పాలవుతారు అనడానికి ఆయన ప్రసంగాలు ప్రవర్తనే సూచికలు" అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి తీసుకుంటున్న వ్యతిరేక నిర్ణయాలు కూడా తమకు కలిసి వచ్చినట్లు రాహుల్ గాంధీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మొత్తం మీద రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తో అటు కేంద్రంలో బీజేపీ కి ఇటు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి చెక్ పడుతున్నట్లు జోస్యం తెలిపారు రాహుల్. మరి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి.Top